Aung San Suu Kyi : ఆంగ్ సాన్ సూకీకి జైలు శిక్ష‌

ఎనిమిదేళ్ల పాటు చెరసాల‌లోనే

Aung San Suu Kyi : ప్ర‌జాస్వామ్య‌యుతంగా ఎన్నికైన ప్ర‌భుత్వాన్ని కూల‌దోసి నియంతృత్వ పాల‌న సాగిస్తున్న సైనిక స‌ర్కార్ తాను అనుకున్న విధంగానే ప్ర‌జా నాయ‌కురాలు, పోరాట యోధురాలిగా పేరొందిన ఆంగ్ సాన్ సూకీకి (Aung San Suu Kyi)జైలు శిక్ష ప‌డేలా చేసింది.

ఇందులో బిగ్ స‌క్సెస్ అయ్యింది. ఆమెతో పాటు ప‌లువురు రాజ‌కీయ నాయ‌కుల‌ను గృహ నిర్బంధంలో ఉంచింది. ఓ వైపు అగ్ర రాజ్యం అమెరికాతో పాటు ఎన్నో దేశాలు విడుద‌ల చేయాల‌ని కోరినా ప‌ట్టించు కోలేదు.

స‌రిక‌దా అన్నింటినీ బంద్ చేసింది. అక్క‌డ ఏం జ‌రుగుతుందో తెలియ‌కుండా జాగ్ర‌త్త ప‌డింది. చివ‌ర‌కు ఐక్య‌రాజ్య స‌మితి సైతం మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న కొన‌సాగుతోందంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

తాజాగా సైనిక ప్ర‌భుత్వం సూకీపై ప‌లు ఆరోప‌ణ‌లు మోపింది. ఇందుకు ఆమెను బాధ్యురాలిని చేస్తూ బోనులో నిల‌బెట్టింది. ప్ర‌పంచం విస్తు పోయేలా మ‌య‌న్మార్ దేశ కోర్టు ఆంగ్ సాన్ సూకీకి మ‌రో నాలుగు సంవ‌త్స‌రాల పాటు జైలు శిక్ష విధించింది.

వాకీ టాకీల‌ను అక్ర‌మంగా దిగుమ‌తి చేసుకోవ‌డం, వాటిని క‌లిగి ఉండ‌డం, క‌రోనా రూల్స్ అతిక్ర‌మించ‌డం, త‌దిత‌ర అభియోగాలు సూకీపై మోపింది సైనిక స‌ర్కార్ .

ఇదిలా ఆమెపై న‌మోదైన రెండు అభియోగాల‌కు సంబంధించి మొత్తం ఎనిమిదేళ్ల జైలు శిక్ష ఖ‌రారు చేసింది కోర్టు. ఇక ఇప్ప‌టి దాకా 12కు పైగా కేసులు న‌మోదు చేసింది.

ఇదిలా ఉండ‌గా సూకీకి మ‌ద్ద‌తుగా మ‌య‌న్మార్ లో పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు కొన‌సాగుతున్నాయి. ఆమెను అక్ర‌మంగా నిర్బంధించారని, సైన్యం మోపిన అభియోగాలు అన్నీ అబ‌ద్ద‌మేనంటూ ఆరోపించారు ఆమె మ‌ద్ద‌తుదారులు.

Also Read : ధిక్కార స్వ‌రం ధైర్యానికి ప్ర‌తిరూపం

Leave A Reply

Your Email Id will not be published!