AUS vs SA 2nd Test 2022 : డేవిడ్ వార్నర్ షాన్ దార్
100వ టెస్టులో డబుల్ సెంచరీ
AUS vs SA 2nd Test 2022 : ఆసిస్ స్టార్ హిట్టర్ గా పేరొందిన డేవిడ్ వార్నర్ దుమ్ము రేపాడు. ఏకంగా తన 100వ టెస్టులో చెలరేగాడు. ఏకంగా డబుల్ సెంచరీతో విస్తు పోయేలా చేశాడు. మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో(AUS vs SA 2nd Test 2022) ఆకాశమే హద్దుగా రెచ్చి పోయాడు. కేవలం 254 బంతులను మాత్రమే ఎదుర్కొన్నాడు వార్నర్.
ఇందులో 2 సిక్సర్లు 16 ఫోర్లు ఉన్నాయి. 200 పరుగులు మాత్రమే చేసి రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. దీంతో నడిచేందుకు ఇబ్బంది పడడంతో ఆట నుంచి నిష్క్రమించాడు. హుటా హుటిన ఫిజియో థెరపిస్ట్ చేరుకుని చికిత్స అందించాడు. ఇక తన క్రికెట్ కెరీరలో డేవిడ్ వార్నర్ వందో టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు.
ఆట పరంగా డబుల్ సెంచరీతో రెండో ఆటగాడిగా ఆస్ట్రేలియా హిస్టరీలో తొలి క్రికెటర్ గా నిలిచాడు డేవిడ్ వార్నర్. ఇక మ్యాచ్ లో భాగంగా ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్ లో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 368 పరుగులు చేసింది. కాలి నొప్పి కారణంగా క్రీజులో నిలవలేక పోయిన వార్నర్ స్థానంలో అలెక్స్ కారే క్రీజులోకి వచ్చాడు.
అతను మూడు పరుగులతో ఉండగా ట్రావియస్ హెడ్ 37 రన్స్ తో మైదానంలో ఆడుతున్నారు. ఇక 100వ టెస్టు మ్యాచ్ పరంగా 200 రన్స్ చేసిన ఆటగాడిగా జో రూట్ చరిత్ర సృష్టించాడు. అతను భారత్ పై ఈ ఘనత సాధించాడు. ఇదిలా ఉండగా ఇటీవల ఇండియాలో జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో డేవిడ్ వార్నర్ ను తిరిగి రీటైన్ చేసుకుంది ఢిల్లీ క్యాపిటల్స్.
Also Read : భారత జట్టు ఎంపికపై ఉత్కంఠ