AUSvsENG 5th Test : కొత్త ఏడాది కూడా అచ్చి రాలేదు ఇంగ్లండ్ కు. వైట్ వాష్ చేద్దామని భావించిన ఆసిస్(AUSvsENG 5th Test )కు నాలుగో టెస్టును డ్రాగా ముగించిన సంతోషం కొద్ది సేపు కూడా మిగల లేదు. ముచ్చటగా ఐదో టెస్టు సైతం అప్పనంగా ఆసిస్ కు అప్పగించింది ఇంగ్లండ్.
అత్యంత పేలవమైన ఆటతీరుతో ఓటమి మూటగట్టుకుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫిఫ్త్ టెస్టుల్లో ఆస్ట్రేలియా దుమ్ము రేపింది. ఘన విజయాలను నమోదు చేసింది.
దీంతో 4-0 తేడాతో ఓడించి యాషెస్ సీరీస్ కైవసం చేసుకుంది. ఇది ఓ రికార్డు కూడా. జో రూట్ నాయకత్వంలోని ఇంగ్లండ్ ఘోరమైన ప్రదర్శన చేసి పరాజయం పాలైంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే 146 పరుగుల తేడాతో గెలుపొందింది ఆస్ట్రేలియా(AUSvsENG 5th Test ). ఇక సీరీస్ విజయ పరంపరలో కీలక పాత్ర పోషించిన ట్రవిస్ హెడ్ మరోసారి తన సత్తా చాటాడు.
విజయం వరించేలా చేశాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ఆది మ్యాచ్ తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సీరీస్ కూడా చేజిక్కించుకున్నాడు. గ్రాండ్ విక్టరీ నమోదు చేయడంతో ఆసిస్ ఆటగాళ్ల సంబురాలు మిన్నంటాయి.
ఇప్పటికే వారు యూఏఈ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2021ను కూడా కీవీస్ ను ఫైనల్ లో చిత్తు చేసి కప్ ఎగరేసుకు పోయారు. ఇప్పుడు యాషెస్ సీరీస్ కూడా వారి వశం కావడంతో ఫుల్ ఎంజాయ్ లో మునిగి పోయారు.
ఐదో టెస్టులో ఆసిస్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 303 పరుగులు చేస్తే రెండో ఇన్నింగ్స్ లో 155 చేసింది. ఇక ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ లో 188 పరుగులకు చాప చుట్టేస్తే రెండో ఇన్నింగ్స్ లో 124కే చేతులెత్తేసింది.
Also Read : వరల్డ్ కప్ లో భారత్ శుభారంభం