Australia ODI Squad : శ్రీ‌లంక‌తో వ‌న్డే సీరీస్ కు ఆసిస్ జ‌ట్టు డిక్లేర్

ప్ర‌క‌టించిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు

Australia ODI Squad : శ్రీ‌లంక‌తో జ‌రిగే తొలి వ‌న్డే మ్యాచ్ కు ఆస్ట్రేలియా(Australia ODI Squad) క్రికెట్ బోర్డు జ‌ట్టును ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే

శ్రీ‌లంక‌లో ఆడుతున్న ఆసిస్ మూడు టీ20 మ్యాచ్ ల సీరీస్ ను గెలుచుకుంది. 2-1 తేడాతో చేజిక్కించుకుంది.

కాగా ప‌ల్లెకెలెలో జ‌రిగిన మూడో టీ20 మ్యాచ్ లో ఊహించ‌ని రీతిలో షాక్ త‌గిలింద ఆసిస్ కు. శ్రీ‌లంక జ‌ట్టు కెప్టెన్ ద‌స‌న్ ష‌న‌క షాన్ దార్ ఇన్నింగ్స్ ఆడాడు . ఓడి పోయే మ్యాచ్ ను గెలిపించాడు.

దీంతో వ‌న్డే సీరీస్ కోసం ఆడే వ‌న్డే మొద‌టి మ్యాచ్ పై తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది. ఆఖ‌రి టి20 మ్యాచ్ లో అనూహ్య విజ‌యాన్ని సాధించిన శ్రీ‌లంక సీరీస్ ఓడి పోయినా ల‌క్ష‌లాది అభిమానుల మ‌న‌సు గెలుచుకుంది.

ప్ర‌స్తుతం వ‌న్డే సీరీస్ పై క‌న్నేసింది. ఈ త‌రుణంలో శ్రీ‌లంక‌తో ఆడే మొద‌టి వ‌న్డే మ్యాచ్ కు సంబంధించి జ‌ట్టును ప్ర‌క‌టించింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. ఇరు జ‌ట్లు 5 మ్యాచ్ ల వ‌న్డే సీరీస్ ఆడ‌నున్నాయి.

కాగా ఆదిలోనే ఆసిస్(Australia ODI Squad) జ‌ట్టుకు ఎదురు దెబ్బ త‌గిలింది. ఎందుకంటే ఫాస్ట్ బౌల‌ర్ కేన్ రిచ‌ర్డ్ స‌న్ గాయం కార‌ణంగా మొత్తం

సీరీస్ కు దూర‌మ‌య్యాడు. పాట్ క‌మిన్స్ అత‌డి స్థానంలో రానున్నాడు.

దీంతో క‌మిన్స్ తో పాటు పేస‌ర్లు జోష్ హేజిల్ వుడ్ , ఝై రిచ‌ర్డ్ స‌న్ ఉన్నారు. స్పిన్న‌ర్ ఆడ‌మ్ జంపా స్వ‌దేశంలో ఉండి పోయాడు. ఇక ఎడ‌మ‌చేతి

వాటం స్పిన్న‌ర్ అస్ట‌న్ అగ‌ర్ వేసే చాన్స్ ఉంది.

ఇక ఆసిస్ జ‌ట్టు ప‌రంగా చూస్తే ఇలా ఉంది. ఆరోన్ ఫించ్ కెప్టెన్. డేవిడ్ వార్న‌ర్ , స్టీవ్ స్మిత్ , మార్న‌స్ లాబూ స్ఛాగే, మార్క‌స్ స్టోయినిస్ , గ్లెన్

మాక్స్ వెల్ , అలెక్స్ కారీ, అస్ట‌న్ అగ‌ర్ , పాట్ క‌మిన్స్ , ఝీ రిచ‌ర్డ్ స‌న్ , జోష్ హేజిల్ వుడ్.

Also Read : కీవీస్ ఇంగ్లాండ్ రెండో టెస్టుపై ఉత్కంఠ

Leave A Reply

Your Email Id will not be published!