Padmaja Bharti : రచయిత్రిగా మార్చిన అభిరుచి
పద్మజా భారతి గెలుపు కథ
Padmaja Bharti : ఒక్కోసారి ఎవరు ఎప్పుడు పాపులర్ అవుతారో చెప్పడం కష్టం. కేవలం అభిరుచి గొప్ప రచయితగా మార్చేసిన కథ పద్మజా భారతిది. వండరింగ్ ఆఫ్ ఇండియన్ ఇంటర్నేషనల్ ఎథిక్స్ పేరుతో ఆమె రాసిన పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందింది. ప్రాముఖ్యత సంతరించుకుంది. భారీ ఎత్తున ఆదరణ చూరగొంటోంది. అంతే కాదు చదివిన వారంతా పెద్ద ఎత్తున ఫిదా అవుతున్నారు. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో చదివారు. ఇగ్నోలో ఎంఏ ఇంగ్లీష్ సాహిత్యం చదివారు.
పద్మజా భారతి మస్టర్ క్లోతింగ్ ప్రైవేట్ లిమిటెడ్ , లిబర్టీ షూస్ వంటి అనేక పేరొందిన సంస్థలలో పని చేశారు. అనేకసార్లు తన సంస్థను ప్రారంభించింది. కానీ ప్రారంభించిన ప్రతీసారి విఫలమైంది. చిన్నప్పటి నుంచి కవితలు రాయడం అలవాటుగా చేసుకుంది.
2018 నుంచి ఎలా రాయాలనే దానిపై ఫోకస్ పెట్టింది పద్మజా భారతి(Padmaja Bharti). ఎథిక్స్ పై పని చేయడం ప్రారంభించింది. చాలా పరిశోధనలు చేశారు. సమాజం, సామాజిక విలువలపై తన దృక్కోణాన్ని తెలియ చేసింది. ఇది విడుదలైన కొద్ది కాలంలోనే పాపులర్ అయ్యింది. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచనా విధానాన్ని కలిగి ఉంటారు. కానీ వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయలేరు.
ఆలోచనలను పంచుకునేందుకు, అభిప్రాయాలను తెలియ చేసేందుకు మంచి సాధనం ఏదైనా ఉందంటే అది కేవలం రచనేనని అంటారు భారతి(Padmaja Bharti). అందుకే తాను దీనినే ఎంచుకున్నానని చెప్పారు. ఇప్పటి వరకు 2 పుస్తకాలు రాశారు. వండరింగ్ ఆఫ్ ఇండియన్ ఇంటర్నేషనల్ ఎథిక్స్ పుస్తకం రాసేందుకు ఆమెకు 5 నెలల సమయం పట్టింది.
Also Read : జీవితం నేర్పిన పాఠం దత్తా విజయం