TTD EO AV Dharma Reddy : టీటీడీ ఇంచార్జ్ ఈవోగా ధ‌ర్మారెడ్డి

ఉత్త‌ర్వులు జారీ చేసిన జ‌గ‌న్ స‌ర్కార్

TTD EO AV Dharma Reddy : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఇంఛార్జ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ (ఈవో)గా అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించింది ఏపీ ప్ర‌భుత్వం. ఈ మేర‌కు సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఉత్త‌ర్వులు జారీ చేశారు.

ఇప్ప‌టి దాకా తిరుప‌తి ఆల‌యంలో సుదీర్ఘ కాలం పాటు విశిష్ట సేవ‌లు అందించిన వారిలో ధ‌ర్మా రెడ్డికి(TTD EO AV Dharma Reddy) పేరుంది. ఆయ‌న హ‌యాంలో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టారు ఈవో.

ఆదివారం టీటీడీ ఇంచార్జ్ ఈవోగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. శ్రీవారి ఆల‌యంలోని బంగారు వాకిలిలో ఉన్న‌తాధికారుల స‌మక్షంలో బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఇదిలా ఉండ‌గా ఆయ‌న ఈవోగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం ఇది రెండోసారి కావ‌డం విశేషం.

సీఎం స్పెష‌ల్ సెక్ర‌ట‌రీగా ప‌దోన్న‌తిపై వెళుతున్న జ‌వ‌హ‌ర్ రెడ్డికి టీటీడీ ఘ‌నంగా వీడ్కోలు ప‌లికింది. కాగా ఏపీలో ప‌లువురు ఐఏఎస్ ల‌ను బ‌దిలీ చేసింది జ‌గ‌న్ ప్ర‌భుత్వం. ధ‌ర్మా రెడ్డికి టీటీడీపై విప‌రీత‌మైన ప‌ట్టుంది.

రెండు సంవ‌త్స‌రాల పాటు కొన‌సాగే చాన్స్ ఉంది. డిప్యూటేష‌న్ ను పొడిగించాల‌ని కోరుతూ కేంద్రానికి విన్న‌వించింది ఏపీ స‌ర్కార్. అయితే ధ‌ర్మారెడ్డి(TTD EO AV Dharma Reddy) ప‌ద‌వీ కాలం ఈనెల 14న డిప్యూటేష‌న్ ముగుస్తుంది.

రెండు విడ‌తులుగా టీటీడీలో బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ధ‌ర్మారెడ్డి ప‌ద‌వీ కాలం నేటితో ఏడు సంవ‌త్స‌రాలు పూర్త‌వుతుంది.

ఇక కేంద్ర స‌ర్వీస్ రూల్స్ ప్ర‌కారం ఏడేళ్ల కంటే ఎక్కువ ఉండేందుకు రాష్ట్ర స‌ర్వీసులో వీలు లేదు. దీనిపై కేంద్రానికి లేఖ రాసింది ఏపీ ప్ర‌భుత్వం.

 

Also Read : బొజ్జ‌ల గోపాల కృష్ణా రెడ్డి ఇక లేరు

Leave A Reply

Your Email Id will not be published!