హైదరాబాద్ వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 144 రన్స్ చేసింది. అనంతరం మైదానంలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ 7 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. స్వల్ప స్కోర్ ను సాధించలేక చేతులెత్తేసింది హైదరాబాద్. హైదరాబాద్ పై అక్షర్ పటేల్ ఆల్ రౌండర్ షోతో ఆకట్టుకున్నాడు.
ఓ వైపు వికెట్లు కోల్పోతున్నా పటేల్ ఎక్కడా తగ్గలేదు. 34 రన్స్ చేసి రాణించాడు. అనంతరం ప్రత్యర్థి జట్టులో కీలకమైన 2 వికెట్లు తీశాడు. ఇక హైదరాబాద్ జట్టులో వాషింగ్టన్ సుందర్ , మయాంక్ అగర్వాల్ రాణించినా ఢిల్లీ బౌలర్ల ధాటికి ఎస్ ఆర్ హెచ్ కుప్ప కూలింది.
ఈసారి ఐపీఎల్ 16వ సీజన్ లో అత్యల్ప స్కోర్లను ఛేదించలేక దిగ్గజ జట్లు పరాజయం పాలు కావడం విస్తు పోయేలా చేసింది. లక్నో చేతిలో రాజస్థాన్ రాయల్స్ 10 పరుగుల తేడాతో ఓడి పోయింది. గుజరాత్ చేతిలో లక్నో చేతులెత్తేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే అక్షర్ పటేల్ ప్రదర్శన ఢిల్లీ విజయానికి బాటలు వేసింది.
పటేల్ తో పాటు మరో బౌలర్ అన్రిచ్ నార్ట్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ సీజన్ లో ఢిల్లీకి ఇది రెండో విజయం . 6 వికెట్లు కోల్పోయి హైదరాబాద్ 137 రన్స్ కే పరిమితమైంది. హెన్రిచ్ క్లాసెన్ 31 రన్స్ చేస్తే సుందర్ 24 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
