Axar Patel : ప‌టేల్ తిప్పేసినా త‌ప్ప‌ని ఓట‌మి

4 ఓవ‌ర్లు 27 ప‌రుగులు 2 వికెట్లు

ఢిల్లీ బౌల‌ర్లు క‌ట్ట‌డి చేసినా ఫ‌లితం లేక పోయింది. దీంతో చెన్నై వేదిక‌గా జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ 27 ప‌రుగుల తేడాతో ప‌రాజయం పాలైంది. ముందుగా ధోనీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 167 ర‌న్స్ చేసింది. రుతురాజ్ గైక్వాడ్ , శివ‌మ్ దూబే , ధోనీ, ర‌హానే, రాయుడు అంద‌రూ 20 ప‌రుగుల‌కు పైగా చేశారు. ప్ర‌ధానంగా ఢిల్లీ క్యాపిట‌ల్స్ బౌల‌ర్లు అద్భుతంగా రాణించారు.

క‌ళ్లు చెదిరేలా బంతుల్ని విసిరారు. ప్ర‌ధానంగా మిచెల్ మార్ష్ అయితే చుక్క‌లు చూపించాడు చెన్నై సూప‌ర్ కింగ్స్ బ్యాట‌ర్ల‌కు. 4 ఓవ‌ర్లు మాత్ర‌మే వేసిన మార్ష్ 18 ప‌రుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. ఇక మ‌రో బౌల‌ర్ అక్ష‌ర్ ప‌టేల్ త‌న‌దైన శైలిలో రాణించాడు.

సూప‌ర్బ్ స్పెల్ తో క‌ట్ట‌డి చేశాడు ప్ర‌త్య‌ర్థుల‌ను. 4 ఓవ‌ర్లు వేసి 27 ప‌రుగులు ఇచ్చి 2 కీల‌క వికెట్లు కూల్చాడు. వీరితో పాటు కుల్దీప్ యాద‌వ్, ల‌లిత్ యాద‌వ్ కూడా రాణించారు. కుల్దీప్ 28 ర‌న్స్ ఇచ్చి ఒక వికెట్ తీస్తే 34 ర‌న్స్ ఇచ్చి మ‌రో వికెట్ ప‌డ‌గొట్టాడు ల‌లిత్ . మొత్తంగా ఈ గెలుపుతో చెన్నై ప్లే ఆఫ్ రేస్ లోకి దూసుకు వెళ్లింది.

ఇదిలా ఉండ‌గా గ‌త సీజ‌న్ లో పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో తీవ్ర నిరాశ ప‌రిచిన ధోనీ సేన ఈసారి దుమ్ము రేపుతోంది. ఇక మ‌రో జ‌ట్టు రోహిత్ సేన కూడా ప్లే ఆఫ్ రేసులోకి దూసుకు వెళుతోంది.

Leave A Reply

Your Email Id will not be published!