Ayesha Malik : పాకిస్తాన్ దేశ చరిత్రలో ఇది ఊహించని పరిణామంగా పేర్కొనక తప్పదు. లాహోర్ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేస్తున్న అయేషా మాలిక్(Ayesha Malik) ను ముస్లిం మెజారిటీ దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్ గా ఎంపికైంది.
ఈ మేరకు ఉన్నతాధికార ప్యానెల్ ఆమోదించింది. దీంతో అయేషా మాలిక్ (Ayesha Malik)సుప్రీంకు మొదటి మహిళా చీఫ్ జస్టిస్ ఎంపికకు మార్గం సుగమమైంది.
ఇదిలా ఉండగా ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్ నేతృత్వంలోని పాకిస్తాన్ జ్యుడీషియల్ కమిషన్ నలుగురికి వ్యతిరేకంగా ఐదు ఓటర్ల మెజారిటీతో మాలిక్ కు ఓకే చెప్పింది.
జాయింట్ పార్లమెంట్ కమిటీ – జేసీపీ ఆమోదం పొందిన తర్వాత అయేషా మాలిక్ పేరును పార్లమెంటరీ కమిటీ పరిగణలోకి తీసుకుంటుంది. ఇదిలా ఉండగా జస్టిస్ మాలిక్ పదవిపై నిర్ణయం తీసుకునేందుకు జేసీపీ మీటింగ్ నిర్వహించడం ఇది రెండోసారి.
అయేషా పేరు మొదటగా గత ఏడాది సెప్టెంబర్ 9న జేసీపీ ముందుకు వచ్చింది. దీంతో ఎంపిక చేసే నిర్ణయాత్మక ప్యానల్ కమిటీలో సభ్యులు సమానంగా వీడి పోయారు.
దీంతో అప్పుడు ఆమె అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారు. సీనియారిటీ సమస్య కారణంగా ఆమె నామినేషన్ పై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
అసోసియేషన్ చీఫ్ అబ్దుల్ లతీఫ్ అఫ్రిదీ దేశంలోని ఐదు హైకోర్టులలో పని చేస్తున్న చాలా మంది న్యాయమూర్తుల కంటే అయేషా మాలిక్ జూనియర్ అని పేర్కొంటూ నిరసన తెలిపారు.
65 ఏళ్ల వయసులో 2031 జూన్ వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేస్తారు.
Also Read : ధిక్కార స్వరం ధైర్యానికి ప్రతిరూపం