Ayesha Naseem : పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు బిగ్ షాక్ తగిలింది. ఊహించని రీతిలో ఆ దేశ మహిళా క్రికెట్ జట్టులో కీలకమైన పాత్ర పోషిస్తూ వస్తున్న అయేషా నసీమ్ (Ayesha Naseem) తాను క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తనకు అనుమతి ఇవ్వాల్సిందిగా పీసీబీని కోరింది. విచిత్రం ఏమిటంటే అత్యంత పిన్న వయసులోనే ఆటకు గుడ్ బై చెప్పడం.
Ayesha Naseem Career
క్రికెట్ రంగానికి సంబంధించి జీవిత కాలం ఆడాలని అనుకుంటారు. జాతీయ స్థాయిలో జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని ఆశిస్తారు. కానీ కేవలం 18 ఏళ్లకే తాను వైదొలుగుతున్నట్లు ప్రకటించడం క్రికెట్ వర్గాలను ప్రత్యేకించి పాకిస్తాన్ క్రీడాభిమానులను నివ్వెర పోయేలా చేసింది.
అయితే తాను ఎందుకు గుడ్ బై చెప్పాలని అనుకుంటున్నాననో అనే దానిపై క్లారిటీ ఇచ్చింది. ఇస్లాం మతం అంటే తనకు గౌరవమని, మత ఆచారాల ప్రకారం తాను జీవించాలని అనుకుంటున్నానని స్పష్టం చేశారు అయేషా నసీమ్.
ఇదిలా ఉండగా 15 ఏళ్లకే క్రికెట్ లో ఎంట్రీ ఇచ్చింది. పాకిస్తాన్ ఉమెన్స్ టీం తరపున 30 టీ20 లు , 4 వన్డేలు, ఆడింది. ప్రస్తుతం అయేషా చేసిన కామెంట్స్ మరింత ఆసక్తిని రేపుతున్నాయి.
Also Read : PM Modi : విపక్షాలకు అంత సీన్ లేదు