Winston Benjamin : అజ‌హ‌రుద్దీన్ స‌హాయం మ‌రువ‌లేం- బెంజిమ‌న్

స‌చిన్ టెండూల్క‌ర్ స‌పోర్ట్ మ‌రిచి పోలేం

Winston Benjamin : వెస్టిండీస్ మాజీ పేస‌ర్ విన్ స్ట‌న్ బెంజిమ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ మ‌హ‌మ్మద్ అజ‌హ‌రుద్దీన్ పై ప్ర‌శంస‌ల జ‌ల్లులు కురిపించాడు.

ఇదే స‌మ‌యంలో స‌చిన్ టెండూల్క‌ర్ కు కూడా థ్యాంక్స్ చెప్పాడు బెంజిమ‌న్(Winston Benjamin). త‌న క్రికెట్ అకాడ‌మీలో యువ‌కుల కోసం కొన్ని

క్రికెట్ ప‌రిక‌రాల‌ను ఇవ్వ‌మ‌ని కోరాన‌ని చెప్పాడు. త‌న‌కు ల‌భించిన స‌హాయం గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాడు.

ఇదే స‌మ‌యంలో భార‌త స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీని ఏకి పారేశాడు. అత‌డిని గొప్ప కెప్టెన్ గా తాను ప‌రిగ‌ణించ బోన‌ని పేర్కొన్నాడు. ఈ సంద‌ర్భంగా త‌మ అకాడ‌మీలో ప‌రిక‌రాలు లేక పోవ‌డాన్ని ప్ర‌త్యేకంగా గుర్తించి త‌న‌కు మ‌హ‌మ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్ ఫోన్ చేశాడ‌ని గుర్తు చేశాడు విన్ స్ట‌న్ బెంజిమ‌న్.

ఇదే క్ర‌మంలో మాజీ కెప్టెన్ అజ్జూ భాయ్ ఏం కావాలో చెప్ప‌మ‌ని కోరాడు. మాజీ క్రికెట‌ర్ స‌చిన్ కూడా సాయం చేశాడ‌ని తెలిపాడు. చాలా మంది  క్రికెట‌ర్లు ప్ర‌పంచంలో ఉన్నారు. కానీ ఇద్ద‌రు మాత్ర‌మే త‌మ వారికి ప‌రిక‌రాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చార‌ని పేర్కొన్నాడు బెంజిమ‌న్.

ఈ సంద‌ర్భంగా తాను అజహ‌రుద్దీన్ కు ధ‌న్య‌వాదాలు తెలియ చేస్తున్నాన‌ని తెలిపాడు. ఒక ర‌కంగా చెప్పాలంటే చాలా సంతోషం క‌లిగింది.

మా లాంటి చిన్న అకాడ‌మెటీకి స‌హాయం చేయ‌డం, ముందుకు రావ‌డం చాలా గ్రేట్ అని పేర్కొన్నాడు విన్ స్ట‌న్ బెంజిమ‌న్. ఈ సంద‌ర్భంగా మ‌హ‌మ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్( Mohammad Azharuddin) తో త‌న‌కు క‌లిగిన అనుబంధం గురించి గుర్తు చేసుకున్నాడు.

1986లో అజ‌హ‌రుద్దీన్ ను క‌లిశా. మేమిద్ద‌రం మంచి స్నేహితులం అయ్యాం. కొన్ని నెల‌ల కింద‌ట ఫోన్ చేశాడు. నేను నా అకాడ‌మీ కోసం సామాగ్రి

పొందేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నాన‌ని చెప్పా. వెంట‌నే స్పందించాడు. ఎలాంటి స‌మ‌స్య లేద‌న్నాడు. వెంట‌నే క్రికెట్ ప‌రిక‌రాల‌ను

పంపించాడ‌ని చెప్పాడు బెంజిమ‌న్.

Also Read : విరాట్ కోహ్లీ గొప్ప కెప్టెన్ కాదు – బెంజిమ‌న్

Leave A Reply

Your Email Id will not be published!