Babar Azam : ఈసారి ఆసియా కప్ మాదే – ఆజమ్
సత్తా చాటుతాం విజయం సాధిస్తాం
Babar Azam : ఆగస్టు 27 నుండి యూఏఈ వేదికగా బిగ్ ఈవెంట్ ఆసియా కప్ ప్రారంభం కానుంది. ప్రధానంగా యావత్ ప్రపంచం దాయాదుల మధ్య జరిగే పోరు గురించి ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తోంది.
భారత్ , పాకిస్తాన్ దేశాల మధ్య రాజకీయ పరమైన కారణాలు, ఉద్రిక్తతల మధ్య కొన్నేళ్లుగా ఇరు దేశాల జట్ల మధ్య మ్యాచ్ లు కొనసాగడం లేదు.
ఇదిలా ఉండగా మ్యాచ్ కేవలం తటస్థ వేదికల మీద మాత్రమే నిర్వహిస్తూ వస్తున్నారు. కరోనా కారణంగా వాయిదా పడిన ఆసియా కప్ వాస్తవానికి శ్రీలంకలో నిర్వహించాల్సి ఉంది.
కానీ ఆర్థిక, రాజకీయ సంక్షోభం కారణంగా శ్రీలంక క్రికెట్ బోర్డు కు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో తాము ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆసియా కప్ ను నిర్వహించ లేమంటూ చేతులెత్తేసింది.
ఇదే విషయాన్ని ఐసీసీకి వెల్లడించింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆసియా కప్ ను యూఏఈకి మార్చేశారు. ప్రస్తుతం క్రికెట్ పండగ ఇప్పుడు అరబ్ ప్రాంతానికి చేరుకుంది.
ఇక అసలైన పోరాటం భారత్ , పాకిస్తాన్ లు ఆగస్టు 28న తల పడనున్నాయి. ఇరు జట్లకు ఇది కీలక మ్యాచ్ . కాగా ఆసియా కప్ లో ఇరు జట్లు మూడు సార్లు ఆడతాయి.
దీంతో ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ సందర్భంగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్(Babar Azam) సంచలన కామెంట్స్ చేశాడు.
ఆ జట్టు అతడి సారథ్యంలో అద్భుతమైన ప్రతిభా పాటవాలు కనబరుస్తోంది. ఈసారి సత్తా చాటుతామని, ఆసియా కప్ ఎగరేసుకు పోతామని ప్రకటించాడు.
Also Read : దుబాయ్ క్యాపిటల్స్ టీమ్ డిక్లేర్