Babu Jagjivan Ram : దీన జనుల బాంధవుడిగా పేరొందారు బాబు జగ్జీవన్ రాం. ఇవాళ ఆయన జయంతి. సమర యోధుడు. సంఘ సంస్కర. రాజకీయవేత్త. బీహార్ లో వెనుకబడిన వర్గాల నుంచి వచ్చి దేశంలోని అత్యున్నత పదవులను అధిరోహించాడు.
బాబూజీగా పిలుచుకునే స్థాయికి తనను తాను మల్చుకున్నాడు. పార్లమెంట్ చరిత్రలో 40 ఏళ్ల పాటు వివిధ పదవులు చేపట్టారు. దేశానికి ఉప ప్రధానిగా ఉన్నారు.
అంటరాని వారికి సమానత్వం కోసం ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ సంస్థను ఏర్పాటు చేశాడు. 1937లో శాసనసభకు ఎన్నికయ్యాడు.
గ్రామీణ కార్మిక ఉద్యమాన్ని నడిపాడు. నెహ్రూ కేబినెట్ లో చిన్న వయసులో పదవి చేపట్టాడు. దేశంలో మొట్ట మొదటి కార్మిక శాఖ మంత్రి. భారత రాజ్యంగ పరిషత్ సభ్యుడిగా ఉన్నారు.
1971లో ఇండియా పాకిస్తాన్ యుద్దం జరిగిన సమయంలో భారత రక్షణ మంత్రిగా ఉన్నాడు బాబూజీ.
దేశంలో హరిత విప్లం, వ్యవసాయాన్ని ఆధునీకరించడంలో ఆయన అందించిన సేవలు ప్రశంసనీయం. చమర్ కులంలో పుట్టాడు.
సామాజిక వివక్షను నిరసించాడు. గాంధీ చేపట్టిన అంటరానితనం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నాడు.
హిందూ మహా సభ సెషన్ లో దేవాలయాలు, తాగునీటి బావులలో దళితులకు ఆలయ ప్రవేశం కల్పించాలని తీర్మానం ప్రతిపాదించాడు.
రెండు సార్లు జైలుశిక్ష అనుభవించాడు. కార్మిక శాఖ మంత్రిగా అనేక కార్మిక సంక్షేమ విధానాలకు పునాది వేశాడు బాబూజీ. పలు శాఖలకు మంత్రి పదవిగా పని చేశాడు.
మొరార్జీ పీఎంగా ఉన్న సమయంలో బాబూజీ (Babu Jagjivan Ram)ఉప ప్రధానిగా ఉన్నారు. ఆయన జయంతిని సమానత్వ దినోత్సవంగా నిర్వహిస్తారు.
అట్టడుగు వర్గాలకు ఆయన ఆశాజ్యోతి నేటికీ . అందుకే ఆయనను ఇప్పటికీ తలుచుకోకుండా ఉండలేరు.
2009లో ఆంధ్రా యూనివర్శిటీ బాబు జగ్జీవన్ రాంకు(Babu Jagjivan Ram) గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. 101వ జయంతి సందర్బంగా ఆయన విగ్రహాన్ని ఆవరణలో ఆవిష్కరించారు.
బాబు జగ్జవన్ రామ్ నేషనల్ ఫౌండేషన్ సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. ఆర్పీఎఫ్ కు ఆయన పేరు పెట్టారు. ఆయన మొదటి నుంచి సామాజిక న్యాయం కోసం ఆక్రోశించాడు. వారి బాగు కోసం పరితపించారు.
Also Read : రాజపక్స రాజభవనం దిగితే బెటర్