YS Sharmila: వైఎస్ షర్మిలపై కేసు నమోదు !
వైఎస్ షర్మిలపై కేసు నమోదు !
YS Sharmila: ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్, కడప పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిలపై బద్వేల్ పోలీసులు కేసు నమోదు చేశారు. మే 2వ తేదీన బద్వేల్ లో నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్ వివేకా హత్య కేసు గురించి ప్రసంగించారని… షర్మిలపై బద్వేల్ నోడల్ అధికారి, మున్సిపల్ కమిషనర్లు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆమెపై ఐపిసి సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
YS Sharmila Case Updates
కాగా, ఎన్నికల నేపథ్యంలో వైఎస్ వివేకా హత్య కేసు గురించి ప్రస్తావించకూడదని కడప కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ వైఎస్ షర్మిల… వివేకా హత్య కేసును ప్రస్తావించారని అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు బద్వేల్ పీఎస్ లో ఆమెపై కేసు నమోదు చేశారు పోలీసులు. కాగా, షర్మిలపై కేసు నమోదు చేయడంపై కాంగ్రెస్ శ్రేణులు సహా విపక్ష పార్టీల నేతలు ఫైర్ అవుతున్నారు. ఇదంతా వైసీపీ నేతల ప్లాన్ అని మండిపడుతున్నారు.
Also Read : Harish Kumar Gupta: ఏపీ నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన హరీశ్‌కుమార్ గుప్తా !