Bal Thackeray : దేశ రాజకీయాలలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచి పోతుంది. మరాఠా యోధుడిగా బాల్ థాక్రే(Bal Thackeray) ఆరాధ్య దైవంగా కొలుస్తారు. సంపాదకుడిగా, చిత్రకారుడిగా, నాయకుడిగా కోట్లాది ప్రజలు ప్రేమించే మనిషిగా ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచి పోతారు.
ఇవాళ బాల్ థాక్రే జయంతి. 1926 జనవరి 23న పుట్టారు. 2012 నవంబర్ 17 న కన్నుమూశారు. శివసేన పార్టీని ఏర్పాటు చేశారు.
పూణేలో పుట్టిన ఈ యోధుడి గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఐదు దశాబ్ధాల పాటు మహారాష్ట్ర రాజకీయాలలో కాకుండా దేశ రాజకీయాలను సైతం ఆయన ప్రభావితం చేశారు.
విలక్షణమైన వ్యక్తిగా, రాజకీయ వేత్తగా పేరొందారు.
1950లో రాజకీయ వ్యంగ్య చిత్రకారుడిగా – కార్టూనిస్టుగా జీవితాన్ని ప్రారంభించారు.
1960 నాటికి సొంత వార పత్రికను ప్రారంభించాడు. ఆ తర్వాత మరాఠా ప్రజల హక్కుల కోసం పోరాటం చేయాలని సంకల్పించాడు.
ఇందు కోసం 1966లో శివసేన పార్టీని ఏర్పాటు చేశాడు. మహారాష్ట్ర మహారాష్ట్రీయులకే అంటూ పిలుపునిచ్చాడు. ఆ ఒక్క నినాదం కోట్లాది ప్రజల ఆర్త నాదంగా మారింది.
ఇందులో భాగంగా ముంబయిని వదిలి వెళ్లి పోవాలని ప్రవాసులను హెచ్చరించాడు. హిందూత్వను, జాతీయ వాదాన్ని బలపరిచాడు.
ఇండియన్ పాలిటిక్స్ లో భారతీయ జనతా పార్టీతో జత కట్టాడు. కీలక పాత్ర పోషించాడు బాల్ థాక్రే(Bal Thackeray).
1995లో మరాఠాలో శివసేన పవర్ లోకి వచ్చినా బాల్ థాకరే మాత్రం ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. ఎన్నికల్లో పోటీ చేయలేదు.
పార్టీ చీఫ్ గా ఉంటూ నడిపించాడు. అయితే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దేశ వ్యాప్తంగా చర్చల్లో నిలిచాడు బాల్ థాక్రే.
86 ఏళ్ల వయసులో ఇక సెలవంటూ వెళ్లి పోయాడు ఈ మరాఠా యోధుడు. ఆయన మరణంతో మరాఠా తల్లడిల్లింది. శివాజీ పార్కు కిక్కిరిసి పోయింది సందర్శకులతో. ముంబై రోడ్లు జనసంద్రమయ్యాయి.
శివసేన ఆవిర్భావం సందర్బంగా ప్రసంగిచిన చోటే బాల్ థాక్రే స్మారకాన్ని ఏర్పాటు చేశారు.
ఎలాంటి పదవీ చేపట్టక పోయినా ప్రభుత్వ పరంగా అధికార లాంఛనాలతో ఆయనకు నివాళులు అర్పించారు.
20 లక్షల మందికి పైగా పాల్గొన్నారు ఆయన అంతిమయాత్రలో. ఇది భారత దేశ చరిత్రలో ఓ నాయకుడి రికార్డుగా మిగిలి పోయింది. అభిమానులు మాత్రం బాల్ థాక్రేను హిందూ హృదయ సామ్రాట్ గా పిలుచుకుంటారు.
ఈ కరడు గట్టిన హిందూ యోధుడికి చికిత్స చేసింది మాత్రం ఓ ముస్లిం వైద్యుడు జలీల్ కావడం విశేషం. ఏది ఏమైనా బాల్ థాక్రే వ్యక్తి కాదు ఓ వ్యవస్థ.
Also Read : ఇండియన్ జేమ్స్ బాండ్ ‘ధోవల్’