Balagam Movie : ఉత్తమ చిత్రంగా ‘బలగం’ మూవీ ఉగాది నంది పురస్కారం..
Balagam Movie : చిన్న సినిమాగా విడుదలైన ‘బలగం’ మూవీ పెద్ద హిట్‌గా నిలిచింది. జబర్ధస్త్ నటుడు వేణు టిల్లు డైరెక్షన్ దర్శకత్వంలో ప్రియదర్శి పులికొండ, కావ్య కళ్యాణ్ రామ్ జోడిగా నటించిన సినిమా ‘బలగం’.
దిల్ రాజు సమర్ఫణలో హర్షిత్ రెడ్డి, హన్షిత ప్రొడ్యూస్ చేసారు. మార్చి 3న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటికే ఈ సినిమా విడుదలైన హిట్ సొంతం చేసుకుంది.
మల్లేశం తర్వాత హీరోగా ప్రియదర్శికి ఈ సినిమాతో మరో సక్సెస్ అందుకున్నాడు. ప్రియదర్శిలో మంచి కమెడియన్ కాకుండా.. మంచి నటుడు ఉన్న విషయం మల్లేశం మూవీతోనే ఇది వరకు ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాలో మధ్య తరగతి తెలంగాణ యువకుడి పాత్రలో తన పరధి మేరకు రాణించాడు.
ప్రియదర్శి తాత పాత్రలో నటించిన సుధాకర్ రెడ్డి తన పాత్రలో జీవించాడు. కావ్యా కళ్యాణ్ రామ్ కూడా తన పాత్రలో ఒదిగిపోయింది. సినిమాలోని మిగతా నటీనటులు తమ పరిధి మేరకు నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ సినిమా నేటితో మూడు వారాలు పూర్తి చేసుకుటోంది. తాజాగా ఈ చిత్రానికి(Balagam Movie) మరో అరుదైన గౌరవం దక్కింది. తెలుగు కొత్త సంవత్సరాది శోభకృత్ నామ సంవత్సరం పురస్కరించుకొని తెలుగు సినిమా వేదిక ఆధ్వర్యంలో ‘బలగం’ చిత్ర యూనిట్ ను ఉగాది నంది సత్కారం తో సత్కరించారు.
బలగం చిత్ర నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హర్షిత, దర్శకుడు వేణు, హీరో ప్రియదర్శి, హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ మరియు ఇతర నటీ నటులు సాంకేతిక నిపుణులను ఎఫ్ డి సి చైర్మన్ అనిల్ కూర్మాచలం, ఆర్ నారాయణ మూర్తి, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ రుద్రరాజు పద్మరాజు నంది పురస్కారంతో ఘనంగా సత్కరించారు.
“బలగం” లాంటి చిత్రాలు(Balagam Movie) మరిన్ని రావాలని ఇదొక దృశ్య కావ్యం అని ఆర్ నారాయణమూర్తి, రుద్రరాజు పద్మ రాజు కొనియాడారు.
మంచి సాంప్రదాయానికి తెరదీసిన తెలుగు సినిమా వేదిక అధ్యక్షులు వర్మ పాకలపాటి, ఉపాధ్యక్షులు మిమిక్రీ రమేష్ కి అభినందనలు తెలిపారు. ముఖ్యంగా దర్శకుడు వేణు యెల్డంది ఈ సినిమాను తెలంగాణ పల్లెల్లోని నేపథ్యాన్ని కళ్లకు కట్టినట్టు చూపించాడు.
తెలంగాణతో పాటు పల్లెలతో అనుబంధం ఉన్న ప్రతి వ్యక్తి ఈ సినిమాకు కనెక్ట్ అవుతున్నారు. దీంతో ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఆదరిస్తున్నారు.
Also Read : ఎలిఫెంట్ విస్పరర్స్ బొమ్మన్ బిల్లీ ఆస్కార్ తో ఫోజులు వైరల్