Balakrishna : బన్నీ..బుచ్చిబాబుకు బాలయ్య కంగ్రాట్స్
ఉత్తమ నటుడు..ఉత్తమ ప్రాంతీయ చిత్రం
Balakrishna : ప్రముఖ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డులను ప్రకటించింది. తెలుగు సినిమాకు సంబంధించి ఈసారి పలు అవార్డులు దక్కాయి.
Balakrishna Appreciated to Allu Arjun
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప చిత్రంలో నటించి మెప్పించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. దీంతో పాటు దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆరు అవార్డులు లభించగా పుష్పకు 2 దక్కాయి.
ఇక ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా తెలుగు సినిమాకు చెందిన బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఉప్పెన ఎంపికైంది. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ(Balakrishna) శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తన సోదరుడు అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడి అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు.
అదే సమయంలో ఆర్ఆర్ఆర్ చిత్రానికి, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు, సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్ కు, ఎంఎం కీరవాణికి , గేయ రచయిత చంద్రబోస్ కు అబినందనలు తెలియ చేశారు నందమూరి బాలకృష్ణ.
Also Read : Revanth Reddy Contest : కోడంగల్ నుంచి రేవంత్ పోటీ