Balakrishna : జ‌క్క‌న్న‌కు బాల‌య్య బాస‌ట‌

ట్రోలింగ్ కు గురైన డైరెక్ట‌ర్

Balakrishna : దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళికి మ‌ద్ద‌తుగా నిలిచాడు నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ‌. రాజ‌మౌళి సాయం చేయండి అంటూ చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపింది.

దేశంలో పాన్ ఇండియా డైరెక్ట‌ర్ గా పేరొందిన రాజ‌మౌళి వ‌ద్ద డ‌బ్బులు లేవా అంటూ చాలా మంది సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌శ్నించారు. మ‌రికొంద‌రు నిల‌దీశారు.

కాగా బాహుబ‌లి స‌మ‌యంలో అనేక పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌కు కో ఆర్డినేట‌ర్ గా ప‌ని చేశారు దేవిక‌. ఆమె క్యాన్స‌ర్ బారిన ప‌డ్డారు. ఈ త‌రుణంలో ఆమె ఆరోగ్య ఖ‌ర్చుల కోసం అవ‌స‌ర‌మ‌య్యే నిధుల సేక‌ర‌ణ గురించి ట్వీట్ చేశారు ఎస్ఎస్ రాజ‌మౌళి.

ఆమెకు తోచినంత సాయం చేయాల‌ని అభిమానుల‌ను, అనుచ‌రుల‌ను కోరాడు. ఊహించ‌ని రీతిలో భారీ సంఖ్య‌లో ట్రోల్స్ ఎదుర‌య్యాయి.

ఉన్న‌త‌మైన ద‌ర్శ‌కుడిగా పేరొందిన మీరు ఆమెను ఎందుకు ఆదుకోలేరు అంటూ మండిప‌డ్డారు. ఈ త‌రుణంలో బాల‌కృష్ణ జ‌క్క‌న్న‌కు అండ‌గా నిలిచారు. రాజ‌మౌళి ఇటీవ‌ల బాల‌కృష్ణ(Balakrishna) షోస్ కు హాజ‌ర‌య్యారు.

తాను నిర్వ‌హిస్తున్న బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ హాస్పిట‌ల్ కు ర‌హ‌స్య దాత‌ల్లో రాజ‌మౌళి కూడా ఒక‌రని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు బాల‌కృష్ణ‌. ఆయ‌న ఇప్ప‌టికే ఆమె కోసం సాయం చేసి ఉండ‌వ‌చ్చ‌ని అర్థం చేసుకోవాల‌ని మ‌రికొంద‌రు సూచించారు.

నిధుల సేక‌ర‌ణ‌లో ఆమెకు మ‌రింత సాయం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఎందుకు అనుకోకూడ‌దంటూ పేర్కొన‌డం విశేషం. మొత్తంగా జ‌క్క‌న్న‌కు బాల‌య్య ర‌క్ష‌ణ‌గా నిల‌వ‌డం విశేషం. బాధితురాలు దేవిక త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆశిద్దాం.

Also Read : ఆడ‌వాళ్లు మీకు జోహార్లు డేట్ ఫిక్స్

Leave A Reply

Your Email Id will not be published!