Balakrishna Unstoppable : బాల‌య్య అన్‌స్టాపబుల్ అదుర్స్

తాజా ఎపిసోడ్ కు భారీ వ్యూస్

Balakrishna Unstoppable : తెలుగు బుల్లితెర మీద న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ(Balakrishna Unstoppable) ఆధ్వ‌ర్యంలో ఆహాలో వ‌స్తున్న అన్‌స్టాపబుల్ ప్రోగ్రాం దుమ్ము రేపుతోంది. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో ఆక‌ట్టుకుంటోంది. రోజు రోజుకు పోటీ మ‌రింత పెరుగుతోంది. దీనిని త‌ట్టుకుని నిల‌బ‌డింది ఈ షో. స‌క్సెస్ కు వ‌య‌స్సుతో సంబంధం లేద‌ని నిరూపిస్తున్నారు బాల‌య్య‌,

అమితాబ్ బ‌చ్చ‌న్. హిందీలో ఇప్ప‌టికీ టాప్ లో కొన‌సాగుతోంది కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తి. స్టార్ కు కోట్లు కురిపిస్తోంది. ఇదే స‌మ‌యంలో క‌ష్టాల నుంచి గ‌ట్టెక్కేలా చేసింది బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ ను. మ‌రోవైపు తెలుగులో ఊహించ‌ని రీతిలో ఏ షోకు రానంత‌టి క్రేజ్ బాల‌య్య బాబు షోకు వ‌స్తోంది.

మొద‌ట అంతా ఆశ్చ‌ర్య పోయారు. కానీ బాల‌య్య ఇప్పుడు టాప్ లో కొన‌సాగుతున్నారు. మొద‌టిసారిగా బుల్లి తెర‌పై బాల‌కృష్ణ తో నిర్వ‌హించిన అన్ స్టాప‌బుల్ ప్రోగ్రాంకు పెద్ద ఎత్తున ఆద‌ర‌ణ ల‌భించింది. దీంతో రెండో ఎపిసోడ్ ను ప్రారంభించారు. దీనిని మ‌రింత అర్థ‌వంతంగా, భిన్నంగా ఉండేలా చూశారు నిర్వాహ‌కులు.

ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్స్ ప్లాన్ వ‌ర్క‌వుట్ అయ్యింది. ఇదిలా ఉండ‌గా డిసెంబ‌ర్ 2న ప్రసార‌మైన బాల‌య్య అన్ స్టాప‌బుల్ ఎపిసోడ్ కు భారీ వ్యూస్ వ‌చ్చాయి. ఈ ఎపిసోడ్ లో ద‌ర్శ‌క, నిర్మాత‌లు కె. రాఘ‌వేంద్ర రావు, డి. సురేష్ బాబు, అల్లు అర‌వింద్ , ఏ. కోదండ‌రామిరెడ్డి హాజ‌ర‌య్యారు.

కేవ‌లం రెండు రోజుల్లోనే 30 మిలియ‌న్ల వ్యూస్ రాబ‌ట్టింది. చంద్ర‌బాబు నాయుడు, లోకేష్ , కిర‌ణ్ కుమార్ రెడ్డి, సురేష్ , రాధిక ను కూడా ఇంట‌ర్వ్యూ చేశారు.

Also Read : ‘మా గ‌ల్లీలో ఒక్క‌డు పోర‌డు’ వైర‌ల్

Leave A Reply

Your Email Id will not be published!