Balineni Srinivas Reddy : ఖాకీల తీరుపై బాలినేని కన్నెర్ర
పోలీసుల తీరు బాగోలేదు
Balineni Srinivas Reddy : ఒంగోలు – అధికారంలో ఉన్న వైసీపీ పార్టీకి చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన ఒంగోలు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకానొక దశలో మండిపడ్డారు. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
Balineni Srinivas Reddy Serious Comments on Police
ప్రకాశం జిల్లాలో నకిలీ భూ దస్తా వేజుల కేసులో పోలీసుల వ్యవహార శైలి దారుణంగా ఉందని బాలినేని శ్రీనివాస్ రెడ్డి ధ్వజమెత్తారు. వారి తీరును నిరసిస్తూ తనకు ప్రభుత్వం కల్పించిన గన్ మెన్ లను తక్షణమే సరెండర్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ మేరకు రాష్ట్ర డీజీపీకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి(Balineni Srinivas Reddy) సుదీర్ఘ లేఖ రాశారు. ఈ కేసులో ఎవరున్నా, ఎంతటి వారైనా సరే అరెస్ట్ చేయాల్సిందేనని పట్టుపట్టారు. ఒకవేళ అధికార పార్టీకి చెందిన వారు ఉన్నప్పటికీ వారిని కూడా వదిలి పెట్ట కూడదంటూ డిమాండ్ చేశారు.
తన ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి తీరును తాను ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు సంవత్సరాల నుంచి ఇలాంటి చిత్ర , విచిత్ర పరిస్థితులను చూస్తున్నానంటూ మండిపడ్డారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ఈ వ్యవహారం ఇప్పుడు జగన్ దృష్టికి వెళ్లింది. ఇంకా ఆయన స్పందించ లేదు.
Also Read : CM KCR Chai : దాబాలో చాయ్ తాగిన కేసీఆర్