Balineni Resign : వైసీపీకి రాజీనామా చేసిన కీలక నేత మాజీ మంత్రి బాలినేని
2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది. ఆ వెంటనే బాలినేని శ్రీనివాస రెడ్డికి మంత్రి పదవి దక్కింది...
Balineni : వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ ముఖ్యనేత బాలినేని శ్రీనివాస రెడ్డి పార్టీని వీడారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అధినేత వైఎస్ జగన్‌కు రాజీనామా లేఖ మెయిల్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి పార్టీ తీరుపై బాలినేని అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల అధినేత జగన్ మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు. ఆ భేటీ తర్వాత కూడా అసంతృప్తితో ఉన్నారు. వైసీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో బాలినేని శ్రీనివాస రెడ్డి(Balineni Srinivasa Reddy) రేపు (గురువారం)సమావేశం అవుతున్నారు.
ఆ భేటీ తర్వాత జనసేన పార్టీలో చేరికపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వైసీపీ(YSRCP) అధినేత జగన్‌తో బాలినేని శ్రీనివాస రెడ్డికి సాన్నిహిత్యం ఉంది. వైసీపీ ముఖ్యనేత వైవీ సుబ్బారెడ్డి సోదరిని బాలినేని వివాహం చేసుకున్నారు. దివంగత వైఎస్ఆర్, జగన్ మోహన్ రెడ్డికి బాలినేని బంధువు కూడా అవుతారు. ఒంగోలు అసెంబ్లీ నుంచి బాలినేని 1999, 2004, 2009, 2012లో నాలుగుసార్లు పోటీ చేసి గెలుపొందారు. 2012లో బాలినేని శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి, వైసీపీలో చేరారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి దామచర్ల జనార్ధన రావు చేతిలో ఓడిపోయారు. 2019లో మాత్రం టీడీపీకి అభ్యర్థి జనార్ధన రావును ఓడించారు.
Balineni Resign YCP..
2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది. ఆ వెంటనే బాలినేని శ్రీనివాస రెడ్డికి మంత్రి పదవి దక్కింది. రెండేళ్లు అటవీ, పర్యావవరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా పనిచేశారు. 2023లో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ సమయంలో బాలినేని మంత్రి పదవి పోయింది. అప్పటి నుంచి పార్టీతో అంటిముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. బాహాటంగానే విమర్శలు చేశారు. బాలినేనితో వైసీపీ పెద్దలు పలుమార్లు చర్చలు జరిపారు. అయినప్పటికీ నో యూజ్. చివరికి పార్టీని వీడారు. వాస్తవానికి గత ఎన్నికల సమయంలోనే బాలినేని పార్టీ వీడతారనే ప్రచారం జరిగింది.
Also Read : Jamili Elections : జమిలి ఎన్నికలపై ఘాటుగా స్పందించిన కాంగ్రెస్