Balram Naik : ఊపిరి ఉన్నంత వరకు కాంగ్రెస్ లోనే
మాజీ ఎంపీ బల రాం నాయక్ కామెంట్
Balram Naik : మహబూబాబాద్ – మాజీ ఎంపీ బలరాం నాయక్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఊపిరి ఉన్నంత వరకు తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. పార్టీ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అన్నారు. శనివారం పార్టీ ఆఫీసులో బలరాం నాయక్ మీడియాతో మాట్లాడారు.
Balram Naik Comment
మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి తీసుకు వస్తానని, సీపీపీ చైర్ పర్సన్ , ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే లకు గిఫ్ట్ గా ఇస్తానని చెప్పారు. ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని అన్నారు.
ఇదిలా ఉండగా బల రాం నాయక్(Balram Naik) మహబూబాబాద్ లోక్ సభ ఎంపీగా ఉన్నారు. కేంద్రంలో మంత్రిగా పని చేశారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. 2009లో తనకు పార్టీ ఛాన్స్ ఇచ్చిందని, అంతే కాకుండా ఎస్టీ కోటా నుంచి కేబినెట్ లో ఛాన్స్ ఇచ్చిందని, ఈ ఘనత సోనియా గాంధీకి దక్కుతుందన్నారు.
తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. కొన ఊపిరి ఉన్నంత వరకు తాను పార్టీని వీడనంటూ పేర్కొన్నారు. పార్టీ పరంగా నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకుని ముందుకు సాగుతానని, పార్టీకి పేరు తీసుకు వచ్చేలా చేస్తానన్నారు.
Also Read : Chandra Mohan : నటుడు చంద్రమోహన్ ఇక లేరు