Gaurav Munjal : వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ వ‌ద్దు ఆఫీసు ముద్దు

అన్ అకాడెమీ సిఇఓ గౌర‌వ్

Gaurav Munjal : ఓ వైపు ఆర్థిక మాంద్యం మ‌రో వైపు ఉద్యోగాల కోత‌తో ఉద్యోగులు బిక్కు బిక్కు మంటున్నారు. ఇప్ప‌టికే ట్విట్ట‌ర్ బాస్ ఎలాన్ మ‌స్క్ ఏకంగా 4 వేల మంది ప‌ర్మినెంట్ ఎంప్లాయిస్ కు చెక్ పెట్టాడు. ఆపై 5 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు మంగ‌ళం పాడాడు. ఇదే స‌మ‌యంలో మెటా – ఫేస్ బుక్ సిఇఓ మార్క్ జుక‌ర్ బ‌ర్గ్ ఆర్థిక మాంద్యం పేరుతో 11 వేల మందిని తీసి వేశాడు.

మ‌రో వైపు బెజోస్ సార‌థ్యంలోని ప్ర‌ముఖ దిగ్గ‌జ ఈకామ‌ర్స్ సంస్థ అమెజాన్(Amazon) ఏకంగా 10 వేల మంది సాగ‌నంపేందుకు శ్రీ‌కారం చుట్టింది. ఇదే స‌మ‌యంలో చాలా కంపెనీలు క‌రోనా కార‌ణంగా వ‌ర్క్ ఫ్రమ్ హోమ్ కు వెసులుబాటు క‌ల్పించాయి. దీంతో ఉద్యోగులు ఇంటి వ‌ద్ద ఉంటూ ప‌ని చేసేందుకు బాగా అల‌వాటు ప‌డ్డారు.

తీరా క‌రోనా త‌గ్గాక కూడా ఇంటి వ‌ద్ద నుంచే ప‌ని చేసేందుకు ఉత్సుక‌త చూపిస్తున్నారు. దీంతో గూగుల్, ఫేస్ బుక్, మైక్రో సాఫ్ట్ , పోలారిస్, డెలాయిట్ , క్యాప్ జెమ‌నీ, ఇన్ఫోసిస్ , విప్రో, టీసీఎస్ ఇలా దిగ్గ‌జ కంపెనీల‌న్నీ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ వ‌ద్దంటున్నాయి. ఇప్ప‌టికే ద‌శ‌ల వారీగా రావాల‌ని ఇమెయిల్స్ ద్వారా స‌మాచారం అంద‌జేశాయి.

కొంత మంది వ‌చ్చేందుకు ఒప్పుకుంటే మ‌రికొంద‌రు రాలేమంటూ గుడ్ బై చెప్పేస్తున్నారు. ఈ త‌రుణంలో ప్ర‌ముఖ విద్యా సంస్థ‌కు చెందిన అన్ అకాడెమీ సంస్థ సిఇఓ గౌర‌వ్ ముంజ‌ల్(Gaurav Munjal) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. ఇక నుంచి ఇంటి వ‌ద్ద నుంచి ప‌ని చేయ‌డం మానుకోవాల‌ని, ఆఫీసుల‌కు రావాల‌ని కోరాడు.

అంద‌రూ వ‌స్తే బాగుంటుంద‌ని సూచించారు. ప్ర‌స్తుతం ఆయ‌న చేసిన ట్వీట్ వైర‌ల్ గా మారింది.

Also Read : ఐటీ రంగానికి ఢోకా లేదు – గోపాల‌కృష్ణ‌న్

Leave A Reply

Your Email Id will not be published!