BAN vs SL Asia Cup 2022 : బంగ్లాదేశ్ పై లంకేయుల ప్ర‌తాపం

ఆసియా క‌ప్ 2022 సూప‌ర్ -4కు

BAN vs SL Asia Cup 2022 :  యూఏఈ వేదిక‌గా జ‌రుగుతున్న ఆసియా క‌ప్ -2022 లో భాగంగా జ‌రిగిన కీల‌కమైన మ్యాచ్ లో శ్రీ‌లంక అద్భుత‌మైన ఆట తీరును క‌న‌బ‌ర్చింది. చివ‌రి ఓవ‌ర్ వ‌ర‌కు ఉత్కంఠ భ‌రితంగా సాగింది.

సూప‌ర్ -4 లోకి ప్ర‌వేశించాలంటే త‌ప్ప‌నిస‌రిగా గెల‌వాల్సిన మ్యాచ్ లో స‌త్తా చాటింది. ప్రారంభ మ్యాచ్ లో ఆఫ్గ‌నిస్తాన్ చేతిలో ఓటమి పాలైంది.

దీంతో ఈ మ్యాచ్ ర‌స‌వ‌త్త‌రంగా మారింది. బంగ్లాదేశ్ జ‌ట్టుపై గ్రాండ్ విక్ట‌రీ(BAN vs SL Asia Cup 2022) సాధించింది. కుస‌ల్ మెండీస్ , కెప్టెన్ ద‌సున్ ష‌న‌క స‌త్తా చాటారు. మెండీస్ కేవ‌లం 37 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 60 ప‌రుగులు చేశాడు.

ఇక ష‌న‌క 33 బాల్స్ ఎదుర్కొని 45 ర‌న్స్ చేసి విజ‌యంలో కీల‌క పాత్ర పోషించారు. అసిత ఫెర్నాండో చివ‌రి వ‌ర‌కు ఉండి త‌న జ‌ట్టు గెలుపులో ముఖ్య పాత్ర పోషించాడు.

అసాధార‌ణ‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకున్నారు. 2 వికెట్ల తేడాతో సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది శ్రీ‌లంక‌. అరంగ్రేటం చేసిన ఫెర్నాండో ఎబాద‌త్ హుస్సేన్ వేసిన 19వ ఓవ‌ర్ లో బౌండ‌రీ కొట్టాడు.

ఒకే ఓవ‌ర్ లో ఎనిమిది ప‌రుగులకు త‌గ్గించాడు. ముస్తాఫిజ‌ర్ రెహ‌మాన్ ఓవ‌ర్ల కోటాను పూర్తి చేశాడు. దీంతో బంగ్లా కెప్టెన్ హ‌స‌న్ మ‌హేదీకి ఇచ్చాడు.

అంత‌కు ముందు బంగ్లాదేశ్ 7 వికెట్ల న‌ష్టానికి 183 ప‌రుగులు చేసింది. ఆఫిష్ 22 బంతుల్లో 39 ర‌న్స్ చేస్తే మ‌హ్మ‌దుల్లా 22 బంతులు ఎదుర్కొని 27 ప‌రుగులు చేశాడు.

మ‌రో వైపు ఆఫ్గ‌నిస్తాన్ ఆసియా క‌ప్ టోర్నీలో దుమ్ము రేపుతోంది. శ్రీ‌లంక‌, ఆఫ్గ‌నిస్తాన్ జ‌ట్ల‌ను వ‌రుస‌గా ఓడించింది. ప్ర‌ధాన జ‌ట్ల‌కు చుక్క‌లు చూపిస్తోంది ఆ జ‌ట్టు.

Also Read : ‘కిషోర్’ దా భ‌వ‌నంలో కోహ్లీ రెస్టారెంట్

Leave A Reply

Your Email Id will not be published!