Banda Prakash : శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా ప్రకాశ్
ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించిన చైర్మన్
Banda Prakash : ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బండ ప్రకాశ్ కు కీలక పదవి దక్కింది. తెలంగాణ శాసన మండలికి డిప్యూటీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా బండ ప్రకాశ్ ను ప్రత్యేకంగా అభినందించారు. అంతే కాకుండా స్వయంగా ప్రకాశ్ ను తానే స్వయంగా తీసుకు వెళ్లి చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టడం విశేషం. విద్యార్థిగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చారు.
ముదిరాజ్ సామాజిక వర్గానికి ఎంతగానో కృషి చేశారని ప్రశంసించారు సీఎం కేసీఆర్. గతంలో బండ ప్రకాశ్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. తాను కావాలని రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలని కోరానని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా ఉన్న నేతి విద్యా సాగర్ రావు పదవీ కాలం పూర్తయింది. ఆనాటి నుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది.
ఇప్పుడు బండ ప్రకాశ్ తో(Banda Prakash) దానిని పూర్తి చేశారు సీఎం కేసీఆర్. 2021లో ఎమ్మెల్యే కోటాలో శాసన మండలికి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. బండ ప్రకాశ్ సేవలు తెలంగాణ ప్రాంతానికి ఎంతో అవసరమని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. డిప్యూటీ చైర్మన్ గా సభలో ఫలవంతమైన చర్చలకు ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఆయన రాజకీయ అనుభవం సభను నడిపేందుకు ఆస్కారం ఏర్పడుతుందని తాను భావిస్తున్నట్లు స్పష్టం చేశారు కేసీఆర్. రాష్ట్రానికి చెందిన మంత్రులు నూతనంగా ఎన్నికైన బండ ప్రకాశ్ ను అభినందించారు.
Also Read : అధునాతన కూరగాయల మార్కెట్లు – సీఎం