Abdul Nazeer AP Governor : ఏపీ గ‌వ‌ర్న‌ర్ గా అబ్దుల్ న‌జీర్

ఛ‌త్తీస్ గ‌ఢ్ గ‌వ‌ర్న‌ర్ గా విశ్వ భూష‌ణ్

Abdul Nazeer AP Governor : దేశంలోని ప‌లు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు గ‌వ‌ర్న‌ర్లు, లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ల‌ను నియ‌మించింది కేంద్ర ప్ర‌భుత్వం. ఇందులో భాగంగా మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ గా ర‌మేష్ బ‌యాస్ కు ఓకే చెప్పింది. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రానికి గవ‌ర్నర్ గా ఉన్న హ‌రిచంద‌న్ విశ్వ భూష‌ణ్ ను మార్చింది. ఆయ‌న స్థానంలో క‌ర్ణాట‌క‌కు చెందిన మాజీ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి స‌య్య‌ద్ అబ్దుల్ న‌జీర్ ను కొత్త గ‌వ‌ర్న‌ర్ గా అపాయింట్ చేసింది. ఈ మేర‌కు రాష్ట్ర‌ప‌తి ఆమోదం తెలిపారు.

ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు గ‌వ‌ర్న‌ర్ గా ఉన్న హ‌రిచంద‌న్ జూలై 24, 2019న ఏపీలో గ‌వ‌ర్న‌ర్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఏపీ సీఎం సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో చాలా హుందాగా, స‌ఖ్య‌త‌తో వ్య‌వ‌హ‌రించారు. మిగ‌తా బీజేపీయేత‌ర రాష్ట్రాల‌లో మాత్రం గ‌వ‌ర్న‌ర్ వ‌ర్సెస్ సీఎంల మ‌ధ్య ఆధిప‌త్య పోరు న‌డుస్తోంది.

ఇక కొత్తగా గ‌వ‌ర్న‌ర్ గా నియ‌మించ‌బ‌డిన జ‌స్టిస్ అబ్దుల్ న‌జీర్(Abdul Nazeer AP Governor) క‌ర్ణాట‌క రాష్ట్రానికి చెందిన వారు. ఆయ‌న ఫ‌కీర్ సాహెబ్ కుమారుడు. బెలువాయి – మూడ్ బిద్రిలో పెరిగారు. మూడ్ బిద్రి లోని మ‌హావీర కాలేజీలో బికాం చ‌దివారు. మంగ‌ళూరు లోని కొడియాల్ బైల్ లో ఎస్డీఎం కాలేజీ నుంచి న్యాయ ప‌ట్టా పొందారు.

1983లో న్యాయ‌వాదిగా న‌మోదు చేసుకుని క‌ర్ణాట‌క హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. మే 2003లో క‌ర్ణాట‌క హైకోర్టు అద‌న‌పు జ‌డ్జిగా నియ‌మితుల‌య్యారు. అదే హైకోర్టులో శాశ్వ‌త జ‌డ్జిగా ప‌ని చేశారు. ఫిబ్ర‌వ‌రి 2017లో న‌జీర్ సుప్రీంకోర్టుకు ఎదిగారు.

ఇదే ఏడాదిలో ట్రిపుల్ త‌లాక్ కేసును విచారించిన బెంచ్ లో జ‌స్టిస్ అబ్దుల్ న‌జీర్ ఏకైక ముస్లిం న్యాయ‌మూర్తి కావ‌డం విశేషం. ట్రిపుల్ త‌లాక్ ప్రామాణిక‌త‌ను స‌మ‌ర్థించారు. అంతే కాదు అయోధ్య వివాదంపై చారిత్ర‌క 2019 సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయ‌మూర్తుల బెంచ్ లో జ‌స్టిస్ న‌జీర్ కూడా స‌భ్యుడిగా ఉన్నారు.

Also Read : రోడ్లు అధ్వాన్నం కేంద్రం కార‌ణం

Leave A Reply

Your Email Id will not be published!