Bandi Sanjay : దేవేందర్ గౌడ్ ను కలిసిన బండి
సంపర్క్ సే సమర్థన్ కార్యక్రమం
Bandi Sanjay : తెలంగాణలో రాజకీయాలు శరవేగంగా మారి పోతున్నాయి. త్వరలోనే రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసింది. సర్వేలతో , అంచనాలు, వ్యూహాలతో ఆ పార్టీ బాస్ కేసీఆర్ దూసుకు పోతుండగా ఆయనకు చెక్ పెట్టి పవర్ లోకి రావాలని భారతీయ జనతా పార్టీ ముందుకు వెళుతోంది.
దేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బీజేపీ సంకీర్ణ సర్కార్ కొలువు తీరి 9 ఏళ్లు పూర్తయిన సందర్బంగా దేశమంతటా విస్తృతంగా ఉత్సవాలను చేపడుతోంది. ఇందులో భాగంగా అన్ని రంగాలకు చెందిన మేధావులు, ప్రముఖులను, ఆయా పార్టీలకు చెందిన మాజీ నేతలను కూడా కలుసుకుంటోంది బీజేపీ.
మంగళవారం అరుదైన సన్నివేశానికి వేదికైంది. భారతీయ జనతా పార్టీ చీఫ్ ,కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) సంపర్క్ సే సమర్థన్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ శివారు లోని తుక్కుగూడకు వెళ్లారు. అక్కడికి సమీపంలోని శ్రీనగర్ గ్రామంలో ఉన్న మాజీ హోం శాఖ మంత్రి తూళ్ల దేవేందర్ గౌడ్ ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఏ పార్టీలోనూ లేరు. కానీ బలమైన గౌడ్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా గుర్తింపు పొందారు.
ఈ సందర్బంగా పార్టీకి సంబంధించిన సాధించిన విజయాలతో కూడిన పుస్తకాన్ని దేవేందర్ గౌడ్ కు అందజేశారు బండి సంజయ్. ఈ సందర్బంగా రాజకీయాలపై చర్చించారు. పనిలో పనిగా తమ పార్టీలోకి రావాలని కూడా కోరినట్లు సమాచారం.
Also Read : RS Praveen Kumar : సీఎం విధులు..బాధ్యతలపై ఫిర్యాదు
