Bandi Sanjay : కేసీఆర్ పాలనలో తెలంగాణ లూటీ
బీజేపీ మాజీ చీఫ్ బండి సంజయ్ కుమార్
Bandi Sanjay : హైదరాబాద్ – భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ నిప్పులు చెరిగారు. ఆయన భారత రాష్ట్ర సమితి, సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని తన అనాలోచిత నిర్ణయాలతో భ్రష్టు పట్టించారని ఆరోపించారు. ఏదో ఒక రోజు ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమన్నారు.
Bandi Sanjay Slams CM KCR
తెలంగాణకు సీఎం కేసీఆర్ చేసింది ఏమీ లేదన్నారు. స్కీంల పేరుతో స్కాంలకు పాల్పడ్డారని బండి సంజయ్(Bandi Sanjay) ఆరోపించారు. కనీసం పోటీ పరీక్షలను సరిగా నిర్వహించ లేని స్థితికి పాలనను దిగజార్చారంటూ ధ్వజమెత్తారు.
10 సంవత్సరాల కాలంలో ఒక్క గ్రూప్-1 పోస్టు భర్తీ చేయలేదని , కేసీఆర్ పూర్తిగా ఫెయిల్ అయ్యారంటూ ఫైర్ అయ్యారు బండి సంజయ్ కుమార్. ఇంటికో ఉద్యోగం ఇస్తానని అన్నారని, రాష్ట్రంలో 2 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని బిశ్వాల్ కమిటీ తేల్చిందన్నారు. కానీ ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా నింపలేదన్నారు .
ఒక్కో నిరుద్యోగికి రూ. లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలని బండి డిమాండ్ చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ఇంకెప్పుడు ప్రక్షాళన చేస్తారంటూ ప్రశ్నించారు. అక్టోబర్ 2న పాలమూరులో జరిగే సభను సక్సెస్ చేయాలని కోరారు.
Also Read : Naga Babu : సీఎం ఎవరనేది కాలమే నిర్ణయిస్తుంది