Bandi Sanjay : హిందువులారా ఇకనైనా మేల్కోండి
బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్
Bandi Sanjay : హైదరాబాద్ – భారతీయ జనతా పార్టీ మాజీ స్టేట్ చీఫ్, జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ పై భగ్గుమన్నారు. ట్విట్టర్ వేదికగా సోమవారం స్పందించారు. సనాతన ధర్మంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బండి సంజయ్.
Bandi Sanjay Comments on Udhayanidhi Stalin
హిందువులు ఇప్పటికైనా మేల్కోక పోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రతిపక్షాలతో ఏర్పాటైన కూటమి (ఇండియా) దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు బండి సంజయ్ కుమార్(Bandi Sanjay). హిందూ మతం నిత్య సత్యాన్ని, బోధనలను డెంగ్యూ, మలేరియాతో పోల్చిన మంత్రి ఉదయనిధి స్టాలిన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సనాతన ధర్మం మతం కాదని అది ఒక జీవన విధానమని స్పష్టం చేశారు బండి సంజయ్ కుమార్ పటేల్.
ఇండియా చేదు కూటమి నిజమైన స్వరూపం ఏమిటనేది ఉదయనిధి స్టాలిన్ తన మాటలతో వ్యక్తం చేశాడని స్పష్టం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే ప్రతి ఒక్కరినీ ఎదుర్కోవాల్సిన అవసరం మనందరిపై ఉందన్నారు బండి సంజయ్.
Also Read : YS Vivekananda Reddy Case : ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రికి షాక్