Bandi Sanjay : ఢిల్లీ లోనే బండి సంజ‌య్ మ‌కాం

కేంద్ర కేబినెట్ ప‌ద‌వి వ‌ద్ద‌న్న బండి

Bandi Sanjay : భార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి నుండి తొల‌గించిన త‌ర్వాత క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ ఇంకా వేచి చూసే ధోర‌ణిని అవ‌లంభిస్తున్నారు. ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. బండి స్థానంలో కేంద్ర మంత్రిగా ఉన్న గంగాపురం కిష‌న్ రెడ్డికి బీజేపీ స్టేట్ చీఫ్ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఇదే స‌మ‌యంలో జూలై 8న వ‌రంగ‌ల్ లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ బ‌హిరంగ స‌భ జ‌ర‌గ‌నుంది. దీంతో కొత్త‌గా బీజేపీ అధ్య‌క్షుడిగా నియ‌మితులైన కిష‌న్ రెడ్డి హుటా హుటిన హైద‌రాబాద‌కు చేరుకున్నారు.

ఇదే స‌మ‌యంలో కిష‌న్ రెడ్డి స్థానంలో బండి సంజ‌య్(Bandi Sanjay) కు కేంద్ర మంత్రివ‌ర్గంలో చోటు క‌ల్పించ‌నున్న‌ట్లు స‌మాచారం. రాబోయే 2024లో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల దృష్ట్యా బీజేపీ హై క‌మాండ్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు 5 రాష్ట్రాల‌కు సంబంధించి బీజేపీ చీఫ్ ల‌ను మార్చింది. ఏపీకి పురంధేశ్వ‌రికి అప్ప‌గిస్తే కిష‌న్ రెడ్డికి తెలంగాణ బాధ్య‌త‌లు అప్ప‌గించింది. పార్టీ ప‌రంగా రెడ్డికి ఇది రెండోసారి పార్టీ చీఫ్ ప‌ద‌వి ద‌క్క‌డం.

ప్ర‌ధాని స‌భ ఉండ‌డంతో ఏర్పాట్ల‌పై బిగ్ ఫోక‌స్ పెట్టింది బీజేపీ రాష్ట్ర కార్య‌వ‌ర్గం. మ‌రో వైపు కిష‌న్ రెడ్డితో హైద‌రాబాద్ కు రావాల్సిన ఎంపీ బండి సంజ‌య్ ఉన్న‌ట్టుండి ఢిల్లీలోనే ఉండి పోయారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణ‌వ్ ఫోన్ చేయ‌డంతో త‌న టూర్ ను ర‌ద్దు చేసుకున్నారు. మొత్తంగా పార్టీ ప‌రంగా ప‌ద‌వి తీసుకుంటారా లేక కేబినెట్ లో కొలువు తీరుతారా అన్న‌ది వేచి చూడాలి.

Also Read : KTR Viral : కేటీఆర్ లుక్ అదుర్స్

Leave A Reply

Your Email Id will not be published!