Bandla Ganesh : రేవంత్ రెడ్డి సీఎం పక్కా – బండ్ల
నిర్మాత సెన్సేషన్ కామెంట్స్
Bandla Ganesh : హైదరాబాద్ – తమ పార్టీకి ఊహించని రీతిలో ఆధిక్యంలో కొనసాగుతుండడం తనకు ఆనందం కలిగిస్తోందన్నారు ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో జరిగిన పోలింగ్ కు సంబంధించి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
Bandla Ganesh Comments Viral
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం లభిస్తుండడం ప్రభుత్వం పట్ల ప్రజలకు ఉన్న వ్యతిరేకత ఏపాటిదో అర్థం అవుతుందన్నారు బండ్ల గణేష్.
కాంగ్రెస్ పార్టీని ప్రజలు అనూహ్యంగా ఆదరిస్తున్నారని ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని జోష్యం చెప్పారు. రేవంతన్నను అడ్డుకునే శక్తి ఎవరికీ లేదన్నారు. తమ పార్టీకి కనీసం 80కి పైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
తాను రేవంత్ రెడ్డిని కలిశానని, ఆయనకు ముందస్తుగా అభినందనలు తెలియ చేయడం జరిగిందన్నారు. రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు బండ్ల గణేష్.
Also Read : Congress Lead : పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ హవా