Barrelakka Sireesha : అందరి చూపు బర్రెలక్క వైపు
కొల్లాపూర్ నియోజకవర్గంలో
Barrelakka Sireesha : నాగర్ కర్నూల్ జిల్లా – రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సంచలనం రేపిన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బర్రెలక్కకు ఎన్ని ఓట్లు వస్తాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ హేమా హేమీలు బరిలో ఉన్నా ఎక్కువ ప్రచారం మాత్రం బర్రెలక్కకు వచ్చింది.
Barrelakka Sireesha sees Whats Happening
అధికార పార్టీ బీఆర్ఎస్ నుంచి బీరం హర్ష వర్దన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. వీరిద్దరి కంటే ఎక్కువగా పోస్టల్ బ్యాలెట్లలో ఆధిక్యం వచ్చింది.
భారీ ఎత్తున బర్రెలక్కకు ఓట్లు పోలవుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక పోస్టల్ బ్యాలెట్ లలో చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గంప గుత్తగా ఓట్లు ఎక్కువగా వచ్చాయి. ఇదిలా ఉండగా తెలంగాణ(Telangana) వ్యాప్తంగా పోలైన 2.20 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్ అయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం 131 టేబుళ్లు ఏర్పాటు చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం.
ఇక ఈ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగుతోంది. మధ్యాహ్నం దాటితేనే కానీ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై పూర్తిగా చెప్పలేం. ఇక బర్రెలక్క విషయానికి వస్తే ఆమె విజయం సాధించక పోయినా ఒక సంచలనం మాత్రం సృష్టించింది.
Also Read : Bandla Ganesh : రేవంత్ రెడ్డి సీఎం పక్కా – బండ్ల
