Chandra Babu Naidu : ఏపీపై తండ్రీ కొడుకుల ఫోకస్
మరోసారి టూర్ కు ప్లాన్
Chandra Babu Naidu : అమరావతి – ఆంధ్రప్రదేశ్ లో తండ్రీ కొడుకులు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ దృష్టి సారించారు. ప్రధానంగా ఏపీలో వైసీపీ పాలన గురించి ఎక్కువగా ఫోకస్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే తెలుగుదేశం, జనసేన పార్టీలు సంయుక్తంగా అధికారంలోకి రావాలని ప్రయత్నం చేశారు.
Chandra Babu Naidu Focus
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దారుణమైన పాలన సాగిస్తున్నారని, ఈ అరాచక పాలన నుంచి ప్రజలను విముక్తం చేయడం తమ ముందున్న ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించడంలో, సర్కార్ ను ఏకి పారేయడంలో కీలకంగా వ్యవహరించాలని నిర్ణయించారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.
ఇదిలా ఉండగా ఏపీ సీఐడీ కోలుకోలేని షాక్ ఇచ్చింది టీడీపీ చీఫ్ కు. ఏకంగా 8 స్కాంలకు సంబంధించి కేసులు నమోదు చేసింది. ఏపీ స్కిల్ స్కాం కేసులో నారా చంద్రబాబు నాయుడు(Chandra Babu Naidu) 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా కొనసాగారు.
ఇటీవలే పర్మినెంట్ బెయిల్ పై బయటకు వచ్చారు. తాజాగా తన సతీమణితో కలిసి ఆలయాలు దర్శించుకుంటున్నారు. ఇప్పటి వరకు తిరుపతి, కనక దుర్గమ్మ, సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్నారు.
Also Read : Barrelakka Sireesha : అందరి చూపు బర్రెలక్క వైపు
