Bandla Ganesh : జ‌గ‌న్ కామెంట్స్ బండ్ల సీరియ‌స్

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ద‌మ్మున్నోడు

Bandla Ganesh : హైద‌రాబాద్ – న‌టుడు, నిర్మాత‌, కాంగ్రెస్ నాయ‌కుడు బండ్ల గ‌ణేశ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై చేసిన వ్యాఖ్య‌లను ఖండించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

Bandla Ganesh Slams CM YS Jagan

పూర్తిగా తాను ఖండిస్తున్న‌ట్లు చెప్పారు బండ్ల గ‌ణేశ్. రాజ‌కీయాల‌లో ఎన్ని అయినా మాట్లాడు కోవ‌చ్చ‌ని కానీ వ్య‌క్తిగ‌త ప‌ర‌మైన అంశాల గురించి మాట్లాడ కూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యం జ‌గ‌న్ రెడ్డికి తెలుసని, కానీ కావాల‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను టార్గెట్ చేయ‌డం త‌న‌ను విస్తు పోయేలా చేసింద‌న్నారు న‌టుడు, నిర్మాత‌.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డే మ‌నిష‌ని స్ప‌ష్టం చేశారు. ఆయ‌న గురించి పూర్తిగా తెలుసు కోకుండా విమ‌ర్శ‌లు చేయ‌డం స‌భ్య‌త కాద‌న్నారు బండ్ల గ‌ణేశ్(Bandla Ganesh). దేశం కోసం బ‌తికే నిస్వార్థ ప‌రుడైన న‌టుడ‌ని కితాబు ఇచ్చారు.

ఇదిలా ఉండ‌గా బండ్ల గ‌ణేశ్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు నెట్టింట్లో వైర‌ల్ గా మారాయి. మ‌రో వైపు నిన్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఏకి పారేశారు. హైద‌రాబాద్ లో ఉంటూ ఏపీలో రాజ‌కీయం చేస్తే ఎలా అని ప్ర‌శ్నించారు. ప్ర‌తి మూడేళ్ల‌కోసారి మూడు ముళ్లే వేస్తే ఎలా అంటూ ఎద్దేవా చేశారు జ‌గ‌న్ రెడ్డి.

Also Read : Revanth Reddy : అక్బ‌ర్ స‌వాల్ రేవంత్ ప్ర‌తి సవాల్

Leave A Reply

Your Email Id will not be published!