Anwarul Azim : కోల్కత్తాలో హత్యకు గురైన బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజిమ్

ఈ హత్య కేసు విచారణకు భారత పోలీసులు సహకరిస్తున్నట్లు సమాచారం.....

Anwarul Azim : కలకత్తాలో అదృశ్యమైన బంగ్లాదేశ్ పార్లమెంటు సభ్యుడు అన్వరుల్ అజీమ్ దారుణ హత్యకు గురయ్యాడు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో విలేకరుల సమావేశంలో బంగ్లాదేశ్ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ ఈ విషయాన్ని ప్రకటించారు. పక్కా ప్రణాళికతో హత్య చేసినట్లు తెలిపారు. హత్యకు పాల్పడిన నిందితులను గుర్తిస్తామని చెప్పారు. అయితే, ఈ హత్యకు సంబంధించి బంగ్లాదేశ్ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఖాన్ తెలిపారు. ఈ హత్య వెనుక ఉద్దేశం తమకు తెలిసిందన్నారు.

Anwarul Azim Murdered..

ఈ హత్య కేసు విచారణకు భారత పోలీసులు సహకరిస్తున్నట్లు సమాచారం. మే 12న బంగ్లాదేశ్ ఎంపీ అజీమ్ చికిత్స నిమిత్తం న్యూఢిల్లీ వచ్చారు. మరుసటి రోజు కలకత్తాలోని తన స్నేహితుడు గోపాల్ బిస్వాస్ నివాసానికి వచ్చాడు. ఆ తర్వాత అదృశ్యమయ్యాడు. అనంతరం అజీమ్(Anwarul Azim) అదృశ్యంపై గోపాల్ బిస్వాస్ తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. అనంతరం వారి సూచనల మేరకు విధాన్‌నగర్‌లోని బాలానగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా, మే 13వ తేదీ వరకు అజీమ్… తన కుటుంబసభ్యులు, స్నేహితుడు గోపాల్ బిశ్వాస్‌తో ఫోన్‌లో టచ్‌లో ఉన్నట్లు మీడియా వెల్లడించింది. బంగ్లాదేశ్‌లో, అన్వరుల్ అజీమ్ ప్రధాని షేక్ హసీనా పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు. అతను అవామీ లీగ్ పార్టీ తరపున పార్లమెంటు సభ్యునిగా జినైదా-4 నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Also Read : Ganta Srinivasa Rao : ఏపీలో కూటమికె పాజిటివ్ వేవ్ ఉంది – గంటా

Leave A Reply

Your Email Id will not be published!