Bangladesh Women: హైదరాబాద్ లో వ్యభిచారంలో పట్టుబడిన బంగ్లాదేశ్ అమ్మాయిలు ?
హైదరాబాద్ లో వ్యభిచారంలో పట్టుబడిన బంగ్లాదేశ్ అమ్మాయిలు ?
ఇటీవల ఖైరతాబాద్, చాదర్ ఘాట్ పరిధిలో కొందరు యువతులు వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఖైరతాబాద్‌లో నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం పోలీసులు ఆరుగురిని కస్టడీలోకి తీసుకున్నారు. వారిలో నలుగురు యువకులతో పాటు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వీరిలో బంగ్లాదేశ్ అమ్మాయిలు ఉన్నట్లు సమాచారం. దీనితో ఈ కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేసారు. వారిని మూడు రోజుల కస్టడీకు తీసుకుని రెండో రోజు విచారణను కొనసాగిస్తున్నారు. రేపటితో విచారణ ముగియబోతోంది. ఈ ఆరుగురిని ఎన్ఐఏ, సీఐ సెల్ అధికారులు రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు.
చాధర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ లో పరిధిలో కూడా మరో ఎనిమిది మంది పట్టుబడ్డారు. వారిని ఈనెల 11వ తేదీన పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. 13వ తేదీ వరకు వీరిని విచారించబోతున్నారు. బంగ్లాదేశ్, బర్మా నుంచి వీరు దేశంలోకి ఎలా వచ్చారనే విషయంపై పోలీసులు ప్రధానంగా ఆరా తీస్తున్నారు. వీరికి ఆశ్రయం ఇచ్చిన వారి వివరాలు, ఆధార్ కార్డు ఎలా పొందారన్న అంశాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. గతంలో బంగ్లాదేశ్ నుండి అక్రమంగా ప్రవేశించిన వారిపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. ఈ నేపథ్యంలో ఆ సమయంలోనే వీరు భారత్ లో ప్రవేశించారా లేక ఇటీవల వీరు ఇక్కడకు వచ్చారా అనే దానిపై ఎన్ఐఏ అధికారులు దృష్టిసారించారు.