Banks Write Off Loans : రూ. 11.17 ల‌క్ష‌ల కోట్ల రుణాలు ర‌ద్దు

ఆర్థిక శాఖ స‌హాయ మంత్రి భ‌గ‌వత్ క‌ర‌ద్

Banks Write Off Loans : భార‌త దేశంలో బ్యాంకులు గ‌త ఆరు సంవ‌త్స‌రాల‌లో రూ. 11.17 ల‌క్ష‌ల కోట్ల విలువైన రుణాలను ర‌ద్దు చేశాయి. మే 1, 2017 నుండి ఉద్దేశ పూర్వ‌కంగా ఎగ‌వేత‌దారుల‌కు సంబంధించి కేసుల‌తో స‌హా 515 కేసులు న‌మోదైన‌ట్లు ఈడీ తెలిపింద‌ని పేర్కొన్నారు కేంద్ర ఆర్థిక శాఖ స‌హాయ మంత్రి భ‌గ‌వ‌త్ క‌ర‌ద్.

2021-22 ఆర్థిక సంవ‌త్స‌రం వ‌ర‌కు గ‌త ఆరేళ్ల‌లో బ్యాంకులు మొండి బకాయిల‌ను మాఫీ(Banks Write Off Loans)  చేసిన‌ట్లు వెల్ల‌డించారు. రాత పూర్వ‌క స‌మాధానంలో ఈ విష‌యాన్ని తెలిపారు. ఆర్బీఐ డేటా ప్ర‌కారం ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు , షెడ్యూల్డు వాణిజ్య బ్యాంకులు గ‌త ఆరు ఆర్థిక సంవ‌త్స‌రాల‌లో వ‌రుస‌గా రూ. 8,16,421 కోట్లు , రూ. 11, 17,883 కోట్ల మొత్తాన్ని ర‌ద్దు చేశాయ‌ని పేర్కొన్నారు కేంద్ర మంత్రి.

ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌కు రూ. 1 కోటి కంటే ఎక్కువ డిఫాల్ట్ చేసిన రైట్ ఆఫ్ లు డిఫాల్ట‌ర్ల పేర్ల‌తో స‌హా జాబితాకు సంబంధించి రైట్ ఆఫ్ లోన్ ఖాతాల‌పై రుణ గ్ర‌హీత‌ల స‌మాచారం ఇచ్చిన‌ట్లు పేర్కొన్నారు. జూన్ 30, 2017 నాటికి ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల్లో రూ. 25 ల‌క్ష‌లు , అంత‌కంటే ఎక్కువ మొత్తంలో బ‌కాయి ఉన్న డిఫాల్ట‌ర్ల సంఖ్య రూ. 8,045 గా ఉంద‌ని ఆర్బీఐ తెలిపింద‌న్నారు.

జూన్ 30, 2022 నాటికి 12,439 , ప్రైవేట్ రంగ బ్యాంకు లో జూన్ 30, 2017 నాటికి 1,616 ఉండ‌గా జూన్ 30, 2022 నాటికి 2,447 మంది డిఫాల్ట‌ర్లు ఉన్నార‌ని కేంద్ర స‌హాయ శాఖ మంత్రి.

డిసెంబ‌ర్ 15, 2022 నాటికి ఈ కేసుల‌లో రూ. 44,992 కోట్ల విలువైన ఆస్తుల‌ను అటాచ్ చేశామ‌ని , డైరెక్ట‌రేట్ ద్వారా 39 ప్రాసిక్యూష‌న్ ఫిర్యాదులు దాఖ‌లైన‌ట్లు వెల్ల‌డించారు.

Also Read : డిజిట‌ల్ ప‌రివ‌ర్త‌నపై భారత్ ఫోక‌స్

Leave A Reply

Your Email Id will not be published!