Sanju Samson BCCI : శాంస‌న్ కు అన్యాయం బీసీసీఐపై ఆగ్ర‌హం

సోష‌ల్ మీడియాలో శాంస‌న్ ట్రెండింగ్

Sanju Samson BCCI : కేర‌ళ స్టార్ బ్యాట‌ర్ , రాజ‌స్థాన్ రాయ‌ల్స్ స్కిప్ప‌ర్ సంజూ శాంస‌న్ ను(Sanju Samson BCCI) వ‌న్డే మ్యాచ్ ల సీరీస్ కు ఎంపిక చేయ‌క పోవ‌డంపై స‌ర్వ‌త్రా నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది. ప‌లువురు మాజీ ఆట‌గాళ్ల‌తో పాటు ఫ్యాన్స్ దుమ్మెత్తి పోస్తున్నారు. భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు రాజ‌కీయాల‌కు వేదిక‌గా మారింద‌ని మండిప‌డుతున్నారు.

టీ20 కి ఎంపిక చేసి వ‌న్డేకు దూరం పెట్ట‌డానికి గ‌ల కార‌ణాలు ఏమిటో చెప్పాల‌ని నిల‌దీస్తున్నారు. ఆట‌గాళ్ల‌ను వారి ప‌ర్ ఫార్మెన్స్ ఆధారంగా ఎంపిక చేస్తార‌ని మ‌రి ఏ ప్రాతిప‌దిక‌న ఇత‌ర ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేశారంటూ ప్ర‌శ్నిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా మాజీ క్రికెట‌ర్ ఆశిష్ నెహ్రా సీరియ‌స్ కామెంట్స్ చేశారు.

అద్భుతంగా ఆడుతున్న శాంస‌న్ ను(Sanju Samson BCCI) ఎందుకు ఎంపిక చేయ‌లేదంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. జ‌ట్టు ఎంపిక చేసే వాళ్లు ఎలా ఆలోచిస్తున్నారో త‌న‌కు అర్థం కావ‌డం లేద‌న్నారు నెహ్రా. ఇదిలా ఉండ‌గా వ‌న్డే జ‌ట్టులో ఎంపిక చేసిన ఆట‌గాళ్ల కంటే శాంస‌న్ స్ట్రైక్ రేట్ ఎక్కువ‌గా ఉంద‌ని పేర్కొంటున్నారు.

ట్వీట్ల‌తో హోరెత్తిస్తున్నారు. సంజూ కు 71 శాతం ఉండ‌గా గిల్ కు 70 , ఇషాన్ కిష‌న్ 59.57 , అయ్య‌ర్ కు 55.69 శాతం మాత్ర‌మే ఉంద‌ని తెలిపారు. ఇక మిగతా ఎంపికైన ఆట‌గాళ్ల‌లో హార్దిక్ పాండ్యాకు 50 శాతం, అక్ష‌ర్ ప‌టేల్ 40 శాతం, రోహిత్ శ‌ర్మ 41.5 శాతం , వాషింగ్ట‌న్ సుంద‌ర్ కు కేవ‌లం 33. 33 శాతం మాత్ర‌మే ఉంద‌ని మ‌రి ఏ ప్రాతిపదిక‌న ఎంపిక చేశారో సెలెక్ట‌ర్లు, బీసీసీఐ చెప్పాలంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Also Read : సూర్య భాయ్ కు ప్ర‌మోష‌న్

Leave A Reply

Your Email Id will not be published!