ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత జ‌ట్టుకు స‌న్మానం

న‌మ‌న్ అవార్డుల కార్య‌క్ర‌మంలో స‌త్క‌రిస్తాం

ముంబై : భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. శ‌నివారం అధికారికంగా ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌గా నిలిచింది సూర్య కుమార్ సార‌థ్యంలోని టీం ఇండియా. ఇందులో భాగంగా ఇప్ప‌టికే ప్రపంచంలో ఏ క్రికెట్ బోర్డు ప్ర‌క‌టించ‌ని న‌గ‌దు బ‌హుమ‌తిని ప్ర‌క‌టించింది బీసీసీఐ. ఈ మేర‌కు విజేత జ‌ట్టుకు రూ. 131 కోట్లు ఇస్తున్న‌ట్లు తెలిపింది. మ‌రో వైపు ఐసీసీ క‌ప్ గెలుచు కోవ‌డంతో భారీ న‌గ‌దు ద‌క్కింది. తాజాగా మ‌రో కీల‌క అప్ డేట్ ఇచ్చింది బీసీసీఐ. త్వ‌ర‌లో బీసీసీఐ ఆద్వ‌ర్యంలో న‌మ‌న్ అవార్డుల కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నుంది. ఇందులోనే భార‌త జ‌ట్టును స‌త్క‌రించ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది.

ఈనెల 15న ఆదివారం ముంబై వేదిక‌గా జ‌రిగిన వార్షిక నామ‌న్ అవార్డుల కార్య‌క్ర‌మంలో స‌త్క‌రించాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించింది.ఇటీవల ఐసీసీ టైటిళ్లను గెలుచుకున్న ఐదు భారతీయ జట్లను స‌త్క‌రించ‌నున్న‌ట్లు తెలిపింది. ఇది చారిత్రాత్మకంగా మొదటిసారి అని భారత క్రికెట్ బోర్డు శనివారం ప్రకటించింది. గౌతమ్ గంభీర్ శిక్షణ పొందిన జట్టు మార్చి 8న అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి మూడుసార్లు T20 ప్రపంచ కప్‌ను గెలుచుకున్న మొదటి జట్టుగా నిలిచింది, టైటిల్‌ను విజయవంతంగా నిలబెట్టుకున్న మొదటిది. స్వదేశంలో ఈ ఘనత సాధించిన మొదటి జట్టుగా నిలిచింది.

ఇదిలా ఉండ‌గా ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఒంట‌రి పోరాటం చేశాడు కేర‌ళ క్రికెట్ స్టార్ సంజు శాంస‌న్. త‌ను కేవ‌లం 5 ఇన్నింగ్స్ లు మాత్ర‌మే ఆడాడు. మొత్తం 321 ర‌న్స్ 200 స్ట్రైక్ రేట్ తో సాధించాడు. టోర్న‌మెంట్ లో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డంతో ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్న‌మెంట్ అవార్డు పొందాడు.

Leave A Reply

Your Email Id will not be published!