WPL 2023 Schedule : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ షెడ్యూల్
మార్చి 4 నుంచి డబ్ల్యూపీఎల్ స్టార్ట్
WPL 2023 Schedule : ప్రపంచంలో మొట్ట మొదటి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ భారత్ లో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఏర్పాట్లు చేసింది. ఏ దేశమూ ఇలాంటి ఆలోచనతో లీగ్ నిర్వహించేందుకు ముందుకు రాలేదు. కానీ క్రికెట్ రంగంలో ఒన్ సైడ్ గా శాసిస్తూ వస్తున్న బీసీసీఐ ఓ అడుగు ముందుకేసింది.
మార్చి 4 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించనుంది. ఇప్పటికే వేలం పాట కూడా పూర్తయింది. ఫ్రాంచైజీలు కూడా ఖరారయ్యాయి. జట్లు కూడా పూర్తయ్యాయి. మొత్తం 5 జట్లు పాల్గొంటాయి. ఉమెన్స్ ప్రీమియర్ లీగల్(WPL 2023 Schedule) లో మొత్తం 22 మ్యాచ్ లు జరుగుతాయి. ఈ రిచ్ టోర్నీ మొత్తం 23 రోజులు జరగనుంది. మార్చి 26న మొదటి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఛాంపియన్ ఎవరు అనేది తేలిపోతుంది.
ఇక పాయింట్స్ పరంగా టాప్ లో ఉన్న జట్టు ఫైనల్ కు చేరుతుంది. నంబర్ 2, 3లలో నిలిచిన జట్ల మధ్య జరిగే పోటీలో టోర్నీ నుంచి వైదొలుగుతుంది.
ఈ రిచ్ లీగ్ లో యుపీ వారియర్స్ , ముంబై ఇండియన్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ , గుజరాత్ జెయింట్స్ ఆడతాయి. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్(WPL 2023) లన్నీ ముంబైలోనే జరుగుతాయి.
ఇక షెడ్యూల్ పరంగా చూస్తే మార్చి 4న గుజరాత్ జెయింట్స్ ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతుంది. 5న ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ , యూపీ వారియర్స్ గుజరాత్ జెయింట్స్ , 6న ముంబై ఇండియన్స్ ఆర్సీబీ మధ్య మ్యాచ్ లు జరుగుతాయి.
7న ఢిల్లీ క్యాపిటల్స్ , యూపీ వారియర్స్ , 8న గుజరాత్ జెయింట్స్ ఆర్సీబీ , 9న ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ , 10న ఆర్సీబీ యుపీ వారియర్స్ మధ్య జరుగుతుంది.
11న గుజరాత్ జెయింట్స్ ఢిల్లీ క్యాపిటల్స్ , 2న యూపీ వారియర్స్ ముంబై ఇండియన్స్ , 13న ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్సీబీ , 14న ముంబై ఇండియన్స్ గుజరాత్ జెయింట్స్ మధ్య జరుగుతుంది.
15న యూపీ వారియర్స్ ఆర్సీబీ , 16న ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ జెయింట్స్ , 18న ముంబై ఇండియన్స్ యూపీ వారియర్స్ మధ్య జరుగుతుంది.
ఆర్సీబీ గుజరాత్ జెయింట్స్ , 20న గుజరాత్ జెయింట్స్ యూపీ వారియర్స్ , ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ , 21న ఆర్సీబీ ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతుంది.
Also Read : రూ. 7 కోట్లు ఇస్తే వస్తా లేదంటే బై బై