BCCI Test Squad : అజింక్యా ర‌హానేకు బంప‌ర్ ఛాన్స్

రోహిత్ శ‌ర్మ‌కు తోడుగా వైస్ కెప్టెన్సీ

BCCI Test Squad : భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) శుక్ర‌వారం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. వ‌చ్చే నెల జూలైలో వెస్టిండీస్ లో ప‌ర్య‌టించే భార‌త క్రికెట్ జ‌ట్ల‌ను ఎంపిక చేసింది. ప్ర‌స్తుతానికి టెస్టు, వ‌న్డే జ‌ట్ల‌ను మాత్ర‌మే ఎంపిక చేసింది. విచిత్రం ఏమిటంటే టీ20 జ‌ట్టును ఇంకా ప్ర‌క‌టించ‌క పోవ‌డం ప‌ట్ల అభిమానులు ఒకింత ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా ఊహించ‌ని రీతిలో 18 నెల‌ల కాలం త‌ర్వాత అజింక్యా ర‌హానే ఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్ లో స‌త్తా చాట‌డంతో అత‌డిని బీసీసీఐ(BCCI) ఏకంగా వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ మ్యాచ్ కు ఎంపిక చేసింది. మిగ‌తా ఆట‌గాళ్లు తేలిపోతే ర‌హానే ఒక్క‌డు మాత్రం మెరిశాడు. తొలి ఇన్నింగ్స్ 89, రెండో ఇన్నింగ్స్ లో 43 ర‌న్స్ చేశాడు. ఈ కీల‌క పోరులో భార‌త జ‌ట్టు ఘోరంగా ఓట‌మి పాలైంది ఆసిస్ తో .

కాగా జూలైలో భార‌త జ‌ట్టు విండీస్ టూర్ కొన‌సాగనుంది. ఇందుకు సంబంధించి వ‌న్డే జ‌ట్టును ప్ర‌క‌టించింది. కాగా రోహిత్ కు తోడుగా ర‌హానేకు వైస్ కెప్టెన్సీ ఇచ్చింది.కేఎల్ రాహుల్ కు షాక్ ఇచ్చింది బీసీసీఐ. ఇక జ‌ట్టు ప‌రంగా చూస్తే .. రోహిత్ స్కిప్ప‌ర్, గిల్ , గైక్వాడ్ , కోహ్లీ, య‌శ‌స్వి జైస్వాల్ , ర‌హానే , బ‌ర‌త్ , కిష‌న్ , ఆర్ అశ్విన్ , జ‌డేజా , ఠాకూర్ , అక్ష‌ర్ ప‌టేల్ , సిరాజ్ , ముఖేష్ కుమార్ , జ‌య‌దేవ్, న‌వ‌దీప్ షైనీ ఉన్నారు.

Also Read : Samson Gaikwad Return : విండీస్ టూర్ కు భార‌త జ‌ట్టు డిక్లేర్

Leave A Reply

Your Email Id will not be published!