INDIA ODI T20 Squad : వన్డే..టి20 జట్లకు రోహిత్ శర్మ కెప్టెన్
ప్రకటించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి
INDIA ODI T20 Squad : కరోనా కారణంగా ఆటకు దూరమైన రోహిత్ శర్మకు రీ షెడ్యూల్ ఐదో టెస్టు మ్యాచ్ కు దూరంగా పెట్టింది భారత క్రికెట్
నియంత్రణ మండలి (బీసీసీఐ). అతడి స్థానంలో స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రాను కెప్టెన్ గా , రిషబ్ పంత్ ను వైస్ కెప్టెన్ గా నియమించింది.
ఇంగ్లండ్ తో ఆడే వన్డే , టి20 సీరీస్ లకు గాను బీసీసీఐ జట్లను(INDIA ODI T20 Squad) ప్రకటించింది. టెస్టుకు దూరంగా ఉన్న రోహిత్ శర్మను కెప్టెన్ గా నియమించింది.
ఇంగ్లండ్ టూర్ లో భాగంగా మూడు వన్డేలు, టి20 మ్యాచ్ లు ఆడనుంది. జూలై 7 నుండి 17 వరకు మూడు టి20లు ఆడుతుంది. యువ పేసర్
అర్ష్ దీప్ సింగ్ వన్డేకు ఎంపిక చేసింది.
ఐర్లాండ్ తో జరిగిన రెండు మ్యాచ్ ల టి20 సీరీస్ కు సింగ్ భారత జట్టులో ఉన్నాడు. కాగా మ్యాచ్ లలో చోటు దక్కించు కోలేక పోయాడు.
సీనియర్ సెలెక్షన్ కమిటీ జట్లను ప్రకటించిందని బీసీసీఐ వెల్లడించింది.
ఇక జట్ల పరంగా చూస్తే టి20(INDIA ODI T20 Squad) కి గాను రోహిత్ శర్మ కెప్టెన్. ఇషాన్ కిషన్ , రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్ ,సూర్య కుమార్ యాదవ్ , దీపీక్ హూడా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీ, హార్దిక్ పాండ్యా, వెంకటేశ్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్ ,
అక్సర్ పటేల్ ,రవిబిష్ణోయ్ , భువీ, హర్షల్ పటేల్ , అవేష్ ఖాన్ , అర్ష్ దీప్ సింగ్ , ఉమ్రాన్ మాలిక్ ఉన్నారు. 2, 3 మ్యాచ్ లకు సంజూ శాంసన్ ను తప్పించారు. ఇక మూడు వన్డేల సీరీస్ కు భారత జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ ఉంటాడు.
శిఖర్ ధావన్ , ఇషాన్ కిషన్ , విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ , శ్రేయస్ అయ్యర్ , రిషబ్ పంత్ , పాండ్యా, జడేజా, శార్దూల్ ఠాకూర్ , చాహల్ , బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ , షమీ, సిరాజ్ , సింగ్ .
Also Read : రోహిత్ స్థానంలో బుమ్రాకు కెప్టెన్సీగా చాన్స్