BCCI Appoints : మ‌హిళా బ్యాటింగ్ కోచ్ గా క‌నిత్క‌ర్

ర‌మేష్ ప‌వార్ ను ఎన్సీఏకు మార్పు

BCCI Appoints : ఓ వైపు ఎన్ని మార్పులు చేసినా భార‌త పురుషుల‌, మ‌హిళా క్రికెట్ జ‌ట్ల‌లో ఆశించిన ఫలితాలు రావ‌డం లేదు. గ‌తంలో బీసీసీఐ బాస్ గా గంగూలీ ఉన్న స‌మ‌యంలో వెంట వెంట‌నే నిర్ణ‌యాలు జ‌రిగేవి. కానీ ప్రస్తుతం బిన్నీ చీఫ్ అయినా అన్నీ జే షా క‌నుస‌న్న‌ల‌లోనే జ‌రుగుతున్నాయ‌న్న ఆరోప‌ణ‌లు లేక పోలేదు.

ఇక పురుషుల జ‌ట్టు గురించి ఎంత త‌క్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే ఇటీవ‌ల ఒక‌టి గెలిస్తే నాలుగు ఓడి పోతున్నారు. ఎవ‌రు స్థిరంగా ఆడ‌డం లేదు. ఐపీఎల్ లో పులులవుతున్నారు. కానీ అంత‌ర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ల‌లో పిల్లులై పోవ‌డం విస్తు పోయేలా చేస్తోంది.

ఈ త‌రుణంలో సెలెక్ట‌ర్ల ప‌నితీరు, ఎంపిక చేయ‌డంలో ప్ర‌తిభ క‌లిగిన ఆట‌గాళ్ల‌కు ప్ర‌యారిటీ ఇవ్వ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఈ త‌రుణంలో సెలెక్ష‌న్ క‌మిటీని పూర్తిగా ర‌ద్దు చేసింది బీసీసీఐ. కొత్త పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించింది. ఇదే క్ర‌మంలో కీల‌క మార్పులు తీసుకుంటోంది.

తాజాగా ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హిళా క్రికెట్ జ‌ట్టు బ్యాటింగ్ కోచ్ గా ఉన్న ర‌మేష్ ప‌వార్ ను బెంగ‌ళూరులోని ఎన్సీఏకు(BCCI Appoints) మార్చింది. ఇప్ప‌టికే దానికి చీఫ్ గా వీవీఎస్ లక్ష్మ‌ణ్ ఉన్నాడు. ఇక వుమెన్ బ్యాటింగ్కోచ్ గా కొత్త‌గా హృషికేశ్ క‌నిత్క‌ర్ ను నియ‌మించింది. ఈనెల 9 నుంచి ముంబైలో ఆసిస్ తో ప్రారంభం కానున్న టీ20 సీరీస్ కు క‌నిత్క‌ర్ జ‌ట్టులో చేరుతాడ‌ని బీసీసీఐ తెలిపింది.

ఎన్ని మార్పులు చేసినా ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌న్న విమ‌ర్శ‌లు లేక పోలేదు.

Also Read : గ్రాండ్ గా శిఖ‌ర్ ధావ‌న్ బ‌ర్త్ డే

Leave A Reply

Your Email Id will not be published!