BCCI Appoints : సెలెక్టర్ల ఎంపికకు అడ్వైజరీ కమిటీ
ప్రకటించిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు
BCCI Appoints : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు సెలెక్షన్ కమిటీని ఎంపిక చేసేందుకు అనుభవం కలిగిన మాజీ క్రికెటర్లతో కూడిన అడ్వైజరీ (సలహా) కమిటీని(BCCI Appoints) నియమించింది. ఈ విషయాన్ని గురువారం అధికారికంగా బీసీసీఐ ప్రకటించింది. ఇప్పటికే చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీని బీసీసీఐ రద్దు చేసింది.
ఆటగాళ్ల ఎంపిక తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇదే సమయంలో తనకు సపోర్ట్ గా ఉన్న సౌరవ్ గంగూలీ కూడా లేకుండా పోయాడు. ప్రధానంగా పంత్ ను కంటిన్యూ చేయడం బాగా ఆడుతున్న శాంసన్ ను పక్కన పెట్టడం, ఏడుగురు కెప్టెన్లను మార్చడం, కోహ్లీని అర్ధారంతరంగా తప్పించడం ఇలా ప్రతిదీ సమస్యగా మారింది బీసీసీఐకి.
దీంతో గంగూలీ వైదొలిగాక ప్రస్తుతం బీసీసీఐ చీఫ్ గా రోజర్ బిన్నీ వచ్చినా మొత్తం వ్యవహారం అంతా నడుపుతోంది మాత్రం కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ షా తనయుడు జే షానే. దీంతో కీలక నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. ఇప్పటికే సెలెక్షన్ కమిటీని రద్దు చేసిన బీసీసీఐ ఈ మేరకు కొత్త కమిటీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.
నవంబర్ 28 డెడ్ లైన్ విధించడం, దరఖాస్తులు భారీగా రావడం జరిగింది. దీంతో ఈ సెలెక్షన్ ప్యానెల్ ను ఎంపిక చేసేందుకు గాను అనుభం కలిగిన ముగ్గురి సభ్యులతో కూడిన సలహా కమిటీని ఇవాళ నియమించింది. ఈ కొత్తగా ఎంపిక చేసిన కమిటీలో మాజీ టెస్ట్ క్రికెటర్ అశోక్ మల్హోత్రా, మాజీ సెలెక్టర్ జతిన్ పరాంజే , మహిళా మాజీ క్రికెటర్ సులక్షణ నాయక్ ఉన్నారు.
Also Read : పంత్ కు గాయం శాంసన్ కు అవకాశం