BCCI Breaks Silence : రోహిత్ శర్మ ఔట్ నిజమే – ఐపీఎల్
సంజూ శాంసన్ కు భారీ ఊరట
BCCI Breaks Silence : ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా ముంబై వేదికగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ , రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 212 రన్స్ చేసింది. అనంతరం మైదానంలోకి దిగిన ముంబై ఇండియన్స్ 213 పరుగులు చేసి గెలుపు సాధించింది.
ఈ మ్యాచ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రత్యేకించి రాజస్థాన్ స్కిప్పర్ సంజూ శాంసన్ పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఒక రకంగా ట్రోలింగ్ కు గురయ్యాడు. రోహిత్ శర్మను ఔట్ చేయడం వివాదాస్పదంగా మారింది. చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ అది ఔట్ కాదని పేర్కొన్నారు. ఇది వైరల్ గా మారింది. దీనిపై పూర్తిగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) పర్యవేక్షణ కమిటీ.
ఈ వివాదానికి దారి తీసిన ఘటనకు సంబంధించి వీడియోను షేర్ చేసింది బీసీసీఐ ప్రత్యేకంగా. సందీప్ శర్మ ఇన్నింగ్స్ రెండో ఓవర్ ఆఖరి బంతికి ఓపెనర్ రోహిత్ శర్మ ను(Rohit Sharma) నకిలీ డెలివరీతో తెలివిగా ఔట్ చేశాడంటూ ఆరోపణలు ఎదుర్కొన్నాడు సంజూ శాంసన్. గతంలో ఇలాంటివి చేసిన దాఖలాలు లేవు.
శర్మ బౌలింగ్ లో హిట్ మ్యాన్ బౌల్డ్ అయ్యాడు. ఔట్ చేయడం క్లీన్ గా అనిపించినప్పటికీ బంతి తగిలిన తర్వాత బెయిల్ నిజంగా పడి పోయిందా లేదా మరొక కారణం ఉందా అని ఫ్యాన్స్ విస్తు పోయారు.స్టంప్స్ వెనుక నిలబడి బెయిల్ పడి పోవడంతో అంపైర్ ఔట్ ఇచ్చాడు. ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టింది. ఐపీఎల్ క్లీన్ డిస్మిస్ అని స్పష్టం చేసింది(BCCI Breaks Silence). ఇందుకు సంబంధించి వివిధ కోణాలతో తొలగింపు వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది.
Also Read : కోహ్లీ కిస్ అనుష్క జోష్