BCCI : మ‌హిళా క్రికెట‌ర్ల‌కు బీసీసీఐ బంప‌ర్ ఆఫ‌ర్

పురుష క్రికెట‌ర్ల‌తో స‌మానంగా ఫీజు వ‌ర్తింపు

BCCI : భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. మ‌హిళా క్రికెట‌ర్ల‌కు ఖుష్ క‌బ‌ర్ చెప్పింది. పురుష (మెన్స్ ) క్రికెట‌ర్ల‌తో స‌మానంగా ఇక నుంచి విమెన్స్ కు మ్యాచ్ ల‌కు సంబంధించి ఫీజులు ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. సౌర‌వ్ గంగూలీ దిగి పోయిన త‌ర్వాత కొత్త అధ్య‌క్షుడిగా కొలువు తీరిన రోజ‌ర్ బిన్నీ సార‌థ్యంలోని పాల‌క‌వ‌ర్గం విస్తు పోయేలా చేసింది.

ఇదిలా ఉండ‌గా 2017 ఐసీసీ మ‌హ‌ళ‌ల ప్ర‌పంచ క‌ప్ లో జ‌ట్టు ర‌న్న‌ర‌ప్ గా నిలిచిన‌ప్ప‌టి నుండి భార‌త మ‌హిళ‌ల క్రికెట్ పై బీసీసీఐ(BCCI)  ఆస‌క్తి పెరుగుతూనే ఉంది. అనంత‌రం 2020లో జ‌రిగిన టి20 ప్ర‌పంచ క‌ప్ లో ఫైన‌ల్ కు చేరుకుంది. 2022లో జరిగిన కామ‌న్వెల్త్ గేమ్స్ లో ర‌జ‌త ప‌త‌కాన్ని గెలుచుకుంది.

గురువారం బీసీసీఐ అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది. పురుషులు, మ‌హిళా క్రికెట‌ర్ల‌కు (కాంట్రాక్ట్ ) మ్యాజ్ ఫీజు ఒకే విధంగా ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది. కాంట్రాక్టు పొందిన సీనియ‌ర్ మ‌హిళా క్రికెట‌ర్లు త‌మ పురుష స‌హ‌చ‌రుల‌కు స‌మాన‌మైన మ్యాచ్ ఫీజును సంపాదిస్తార‌ని బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షా ధ్రువీక‌రించారు.

లింగ వివ‌క్ష ఉండ కూడ‌ద‌నే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని బీసీసీఐ చీఫ్ రోజ‌ర్ బిన్నీ స్ప‌ష్టం చేశారు. ఒక్కో టెస్టుకు రూ. 15 లక్ష‌లు , వ‌న్డే మ్యాచ్ కు రూ. 6 ల‌క్ష‌లు, టి20 మ్యాచ్ కు రూ. 3 ల‌క్ష‌లు చెల్లించ‌డం జ‌రుగుతుంద‌ని వెల్ల‌డించారు.

ఇదిలా ఉండ‌గా న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఇదే విధ‌మైన నిర్ణ‌యం తీసుకుంది. మ‌హిళా క్రికెట‌ర్ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది.

Also Read : కోల్డ్ ఫుడ్ పై గంగూలీ కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!