Ajit Agarkar : జట్ల ఎంపికలో కీలక మార్పులు
టెస్టు..వన్డే..టి20 ఫార్మాట్ లకు వేర్వేరు
Ajit Agarkar : జీ టీవీ స్టింగ్ ఆపరేషన్ లో దొరికిన బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ రాజీనామా చేశాక ఆ పదవిలో కొలువు తీరిన భారత మాజీ క్రికెటర్, ఆల్ రౌండర్ అజిత్ అగార్కర్(Ajit Agarkar) జట్ల ఎంపికపై ఫోకస్ పెట్టాడు. ప్రధానంగా భారంగా ఉన్న ఎవరైనా సరే పరిగణలోకి తీసుకునే ప్రసక్తి లేదని తెగేసి చెప్పాడు. అటు ఐపీఎల్ ఇటు దేశీవాలి క్రికెట్ టోర్నీలలో అద్భుతమైన ప్రతిభా పాటవాలు కనబర్చిన యంగ్ బ్లడ్ కు ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించాడు.
Ajit Agarkar Comments
ఇందులో భాగంగా విండీస్ టూర్ లో పర్యటిస్తున్న టి20 టీం నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని పక్కన పెట్టడం క్రికెట్ ఫ్యాన్స్ ను విస్తు పోయేలా చేసింది. ఇప్పటికే లెక్కకు మించి టాలెంట్ దాగి ఉంది భారత క్రికెట్ లో . ప్రత్యేకించి ఐపీఎల్ వచ్చాక కుప్పలు తెప్పలుగా యువ క్రికెటర్లు వెలుగులోకి వస్తున్నారు. తమ ఆట తీరుతో ఆకట్టుకుంటున్నారు.
ప్రధానంగా రెండు వరల్డ్ కప్ లు త్వరలో జరగనున్నాయి. ముందుగా ఆసియా కప్ , ఒలింపిక్ గేమ్స్ లలో పాల్గొనే జట్లను కూడా వేర్వేరుగా డిక్లేర్ చేశాడు అజిత్ అగార్కర్. ఇక ఐసీసీ వన్డే వరల్డ్ కప్ భారత్ లో జరగనుంది. దాని కోసం కూడా కసరత్తు మొదలు పెట్టాడు. తాజాగా రోహిత్, కోహ్లీని తప్పించడం ఏమిటనే ప్రశ్న ఉదయిస్తోంది.
Also Read : Nara Lokesh : జగన్ పాలన జనం వేదన