BCCI : ఐసీసీ చైర్మన్ అభ్యర్థిపై బీసీసీఐ డైలమా
ముంబైలో జరిగిన సర్వ సభ్య సమావేశం
BCCI : భారత దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం కలిగిన సంస్థల్లో ఒకటిగా పేరొందిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సమావేశం మంగళవారం ముంబైలో జరిగింది. దేశంలోని వివిధ క్రీడా సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. బీసీసీఐ న్యూ బాస్ గా రోజర్ బిన్నీ ఎన్నిక కాగా ఎప్పటి లాగే కార్యదర్శిగా జే షా ఎంపికయ్యాడు.
ఇక రాజీవ్ శుక్లా వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఇక మూడు సంవత్సరాల పాటు బీసీసీఐ(BCCI) బాస్ గా ఉన్న గంగూలీ ఇవాల్టితో తప్పుకున్నారు. ఆయన మరోసారి బీసీసీఐ బాస్ కావాలని అనుకున్నారు. కానీ రాజకీయాల కారణంగా తను పోటీలో ఉండలేక పోయాడు. కానీ అమిత్ షా తనయుడు మాత్రం రెండోసారి కార్యదర్శిగా ఎంపిక కావడం పలు విమర్శలకు దారి తీసింది.
మరో వైపు గంగూలీ ఈ ఏడాది డిసెంబర్ లో జరగనున్న ఐసీసీ చైర్మన్ పదవికి పోటీ చేయాలని భావించారు. కానీ బీసీసీఐ నుంచి సపోర్ట్ లేనట్లు సమాచారం. ఇదిలా ఉండగా బీసీసీఐ కీలక సమావేశంలో ఐసీసీ చైర్మన్ అభ్యర్థిని ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై చర్చకు రాలేదని సమాచారం.
ఇప్పటికే బీసీసీఐ తన పేర్లను పంపించాల్సి ఉంటుంది. ఇక జే షా ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా ఉన్నారు. బీసీసీఐ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. కాగా ఐసీసీ చైర్మన్ అభ్యర్థి కోసం దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 20 ఆఖరు.
అయితే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. గంగూలీని ఐసీసీ చైర్మన్ అభ్యర్థిగా పంపించాలని కోరారు.
Also Read : బీసీసీఐ కీలక నిర్ణయాలు ఇవే