BCCI Failure : బీసీసీఐ తీరుపై సర్వత్రా ఆగ్రహం
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ నిర్వహణ లోపం
BCCI Failure : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ప్రధాన కారణం ఐసీసీ వన్డే వరల్డ్ కప్ నిర్వహణ తీరు సరిగా లేదంటూ అభిమానులు, మాజీ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
ప్రధానంగా ప్రపంచ క్రికెట్ రంగంలో అత్యధిక ఆదాయం కలిగిన క్రీడా సంస్థగా బీసీసీఐ పేరు పొందింది. వేల కోట్ల రూపాయలు ఉన్నా ఫాయిదా లేకుండా పోయిందని పేర్కొంటున్నారు. ప్రచారం చేయడంలో , టికెట్ల కేటాయింపులో సైతం ఘోరంగా విఫలమైందని ఆవేదన చెందుతున్నారు.
BCCI Failure Shocking Comments
ప్రధానంగా ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) పై బీసీసీఐ(BCCI) పెట్టినంత శ్రద్ద ఐసీసీ వన్డే వరల్డ్ కప్ పై పెట్టలేదంటూ మండి పడుతున్నారు. భారత క్రికెట్ జట్టు మాజీ స్కిప్పర్, ప్రముఖ కామెంటేటర్ సునీల్ మనోహర్ గవాస్కర్ అయితే షాకింగ్ కామెంట్స్ చేశారు.
కనీసం స్కోర్ బోర్డులు కూడా ఏర్పాటు చేయలేక పోవడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. బీసీసీఐ చీఫ్ రోజర్ బిన్నీ, కార్యదర్శి జే షాలను ఏకి పారేశారు. అసలు వరల్డ్ కప్ జరుగుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఇకనైనా తన తప్పు తెలుసుకుని బీసీసీఐ టోర్నీని సమర్థవంతంగా నిర్వహించాలని స్పష్టం చేశారు సన్నీ.
ఇదిలా ఉండగా బీసీసీఐ ఆధ్వర్యంలో రూపొందించిన థీమ్ సాంగ్ కూడా పేలవంగా ఉందంటూ పెదవి విరిచారు క్రికెట్ ఫ్యాన్స్.
Also Read : Gudivada Amarnath : పవన్ వయాగ్రా టాబ్లెట్ లాంటోడు