BCCI Focus : ప్రపంచ కప్ పై ఫోకస్ జట్టుపై నజర్
బీసీసీఐ సమావేశంలో కీలక నిర్ణయం
BCCI Focus : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక సమావేశం ముగిసింది. సంచలన నిర్ణయాలు తీసుకుంది. బీసీసీఐ బాస్ బిన్నీ సారథ్యంలో జరిగిన మీటింగ్ లో ప్రధానంగా ఆటగాళ్ల ఎంపిక, పిట్ నెస్ , ఈ ఏడాది ఆయా జట్లతో జరిగే సీరీస్ లు, ప్లేయర్ల పర్ ఫార్మెన్స్ , దేశీవాళీ లో జరిగే టోర్నీలు, ఐపీఎల్ , ఐసీసీ వరల్డ్ కప్ , పాకిస్తాన్ లో జరిగే ఆసియా కప్ , తదితర ప్రధాన అంశాలపై చర్చించింది బోర్డు(BCCI Focus).
ప్రధానంగా ప్రపంచ కప్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. దీంతో ఈసారి ఎలాగైనా సరే టీమిండియా ఛాంపియన్ గా నిలిచేందుకు దమ్మున్న ఆటగాళ్లను ఇప్పటికే సిద్దం చేసినట్లు సమాచారం. కానీ ముందస్తుగా ప్రకటించేందుకు సాహించలేదు బీసీసీఐ. ఎందుకంటే టోర్నీ కంటే ముందు ప్రకటిస్తే బెటర్ అని. లేక పోతే సవాలక్ష సమస్యలు వస్తాయని భయపడుతోంది.
ఇప్పటికే సోషల్ మీడియాలో విమర్శలు, మీమ్స్ తో హోరెత్తుతోంది. ప్రధానంగా కేరళ స్టార్ సంజూ శాంసన్ విషయంలో బీసీసీఐ అనుసరిస్తున్న వైఖరిని ఎండగడుతున్నారు. ఇక ముంబైలోని బీసీసీఐ(BCCI Focus) ప్రధాన కార్యాలయంలో తీవ్ర తర్జనభర్జన చోటు చేసుకుంది. ఇప్పటికే షార్ట్ లిస్ట్ చేసినట్టు టాక్. కానీ పేర్లు వెల్లడించలేదు.
ఫీల్డింగ్ పరంగా భారత జట్టు పేలవంగా ఉంది. అందుకే ఫిట్ నెస్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టాలని నిర్ణయించింది బోర్డు. ఇక నుంచి జాతీయ జట్టులోకి రావాలంటే దేశీవాళీ టోర్నీలో విధిగా ఆడాలని స్పష్టం చేసింది. ఇక విదేశీ టూర్లలో , ఐసీసీ మెగా టోర్నీల్లో భారత ఆటగాళ్లు వరుసగా విఫలమవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
Also Read : శ్రీలంక రాణిస్తుందా భారత్ గెలుస్తుందా